Jabardasth : జబర్ధస్త్  షోకు ఖతర్నాక్ జడ్జీ దొరికిండు
Cinema Latest

Jabardasth : జబర్ధస్త్ షోకు ఖతర్నాక్ జడ్జీ దొరికిండు

Jabardasth : బుల్లితెర పై జబర్ధస్త్ (Jabardasth )షో క్లిక్ అయినట్టుగా మరే కామెడీ షో కూడా అంత హిట్ కాలేదు. ఈ షోతో చాలా మంది స్టార్స్ అయిపోయారు. ఫస్ట్ నుంచి జడ్జీలుగా ఉన్న నాగబాబు, రోజా షో నుంచి వెళ్లిపోయాక షోకు కాస్త కళ పోయిందనే చెప్పాలి. వాళ్ల ప్లేస్ ను రీప్లేస్ చేయడానికి చాలా మందిని తీసుకోస్తున్నారు నిర్వాహకులు.. కానీ వాళ్ల లాగా ఎవ్వరూ కూడా వావ్ అనిపించడం లేదు. రోజా ప్లేస్ లో ఇంద్రజ సెట్ అయింది కానీ నాగబాబు ప్లేస్ ఇంకా బోసి కొడుతునే ఉంది. మధ్యలో సింగర్ మనో పర్వాలేదనిపించినా.. కంటిన్యూ కాలేకపోయాడు.

ఇప్పుడు ఈ ఖతర్నాక్ కామెడీ షోకు ఖతర్నాక్ జడ్జీ దొరికాడు. అయనే కమెడియన్ కృష్ణభగవాన్.. ఏమైందో ఏమో కానీ ఆయన ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. కానీ జబర్ధస్త్ షోతో పర్పెక్ట్ రీఎంట్రీ ఇచ్చారు. స్వతహాగా గోదావరి జిల్లాలో పుట్టడం, మాటల రచయిత కావడంతో కృష్ణభగవాన్ కు ముందునుంచి వెటకారం ఎక్కువే. ఆయన సినిమాల్లో వేసే పంచులు కూడా బీభత్సంగా పేలుతాయి. అలాంటిది వెటకారం లాంటి జబర్ధస్త్ షో ఆయనకు దొరికితే ఇంకేంటి రచ్చ రచ్చ ఉంటుంది. అదే అయింది.

జబర్ధస్త్ లో కమెడియన్లు వేసే పంచుల కంటే కృష్ణభగవాన్ వేసే పంచులు వీపరితంగా పేలుతున్నాయి. ఇన్నాళ్లకు షోకు ఖతర్నాక్ జడ్జీ అంటూ ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిర్వాహకులు కృష్ణభగవాన్ ని ఒక ఎపిసోడ్‌కే పరిమితం చేస్తారా లేకా కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. ఆడియన్స్ కి మాత్రం కృష్ణభగవాన్ ను కొనసాగించాలంటూ యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :