Gayatri : యూట్యూబర్‌గా, నటిగా తనకంటూ ఇప్పుడిప్పుడే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న గాయత్రి(Gayatri) శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఇక వివరాల్లోకి వెళితే.. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా గాయత్రిని.. రోహిత్ కారు ఎక్కించుకుని అక్కడి నుంచి ప్రిజం పబ్‌కు తీసుకెళ్లాడు.
హోలీ సెలబ్రేషన్స్ ముగించుకుని విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా ఫుట్ పాత్ పై కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే గాయత్రి కారు నడుపుతున్నట్లు సమాచారం. అతివేగం కారణంగానే కారు అదుపుతప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయత్రి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా.. రోహిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం రోహిత్ పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. గాయత్రి మరణవార్తతో ఆమె సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖ నటీనటులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Also Read :
- Prashant Kishor : పబ్లిక్ తో పీకే టీమ్ సర్వే…పరేషాన్ లో మంత్రి అల్లోల
- Shivareddy : శివారెడ్డి కూతురు హాఫ్ శారీ ఫంక్షన్..!