home page

 రామచంద్రప్రభు వీళ్ళ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాం.. ప్రతి ప్రోమోలో ఎదో సోది..! 

 | 
Extra Jabardasth

టెలివిజన్ షోలలో జబర్దస్త్ షోకి ఉన్న డిమాండ్ మరే షోకి కూడా లేదనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.. ఎనిమిదేళ్ళ క్రితం మొదలైన ఈ షో ఇప్పటికి ఫుల్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. అయితే ఈ షో సక్సెస్ లో కొన్ని జోడిల పాత్ర ఎంతగానో ఉంది. అందులో రష్మీ, సుడిగాలి సుదీర్ జోడీ ఒకటిగా కాగా, ఇమ్మానుయేల్- వర్ష జోడీ ఒకటి.. ఈ రెండు జోడీల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తూ ముందుకు సాగుతుంది జబర్దస్త్.

ఈ జోడీల మధ్య ఫుల్ లవ్ నడుస్తున్నట్టుగా చూపిస్తూ టీఆర్పీని పెంచుకుంటుంది మల్లెమాల టీం.. అయితే ఇవి టీఆర్పీ కోసమే అని తెలిసిన ఆడియన్స్ ఫుల్ ఫ్రస్టేషన్ ఫీల్ అవుతున్నారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమోలో  ఇమ్మానుయేల్- వర్ష జోడీ మధ్య జరిగిన స్కిట్ లో ఫుల్ లవ్ ఎమోషనల్ డ్రామాని మిక్స్ చేసి అక్కడ ఎదో జరిగిపోతున్నట్టుగా ప్రేక్షకుల మీదికి ప్రోమోని వదిలారు. 

ఇంతకీ ప్రోమోలో ఉన్న మ్యాటర్ ఏంటంటే..  వర్ష, ఇమాన్యూయేల్ ప్రేమించుకుంటారు. వర్షను పెళ్లాడాల్సిన ఇమ్మానుయేల్ అనుకోని పరిస్థితుల్లో వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాడు. దీంతో వర్ష తెగ ఫీలై పోతుంది. ఒక వేళ ఇదే నిజం అయితే వర్ష నీ పరిస్థితి ఏంటని రోజా అడుగుతుంది. దీనితో కాస్తా వర్ష ఎమోషనల్ అయినట్టుగా కట్ షాట్స్ వేశారు. వర్ష ఏడవడం చూసి ఇమ్మా బాధపడినట్టుగా మరింత డోస్ పెంచారు. 

ఇది చూసిన నెటిజన్లు మాత్రం ఫుల్ ఫ్రస్టేషన్ ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్రస్టేషన్ మొత్తం కామెంట్స్ రూపంలో వదిలారు. ఒక్కసారి వాటిపైన ఓ లుక్కేయండి..!

రామచంద్రప్రభు వీళ్ళ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాం
ప్రతి ప్రేక్షకులకు తెలుసు మీ TRP లు పెంచుకోవడానికి మీ ట్రిక్స్
ఓరి మీ దుంపలుతెగ మీరు ఎక్కడ తగిలారురా స్వామి,ఏంటి ఇ ఓవర్ యాక్షన్
ప్రతి ప్రోమోలో  ఏదోక ఒక సోది
జనాల్ని ఏర్రిపువ్వులు చేయటం లో మీకు మీరే సాటి,నా లవుడా లో లవ్ స్టోరీ లు మీరు
తాపకొక ఎపిసోడ్ లో ఏదో ఒక ఓవర్ యాక్షన్ చేస్తారు ఏంట్రా
రోజా గారు మ్యారేజ్ బ్యూరో పెట్టేయండి 
ఇంకెన్నాళ్ళు రా ఈ లింకుల గోల ఇది కామెడీ షోనా లేక మాట్రిమొనీ షోనా?
ఇన్ని నెగిటివ్ కామెంట్స్ చూశాక కూడా ఎందుకు ఆ వర్ష ఇమ్మానుయేల్ జోడీ కొనసాగిస్తున్నారు చూడలేక చస్తున్నాం.