home page

జయమ్మ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి ఆమె తండ్రే కారణం.. ఎందుకంటే? 
 

 | 
జయమ్మ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి ఆమె తండ్రే కారణం.. ఎందుకంటే?

తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ అన్న సంగతి అందరికి తెలిసిందే.. హీరోయిన్ గా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన వరలక్ష్మి.. పాత్ర నచ్చితే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమేనని నటించి.. తనలో ఎంత మంచి నటి ఉందో ప్రూవ్ చేసుకుంది.  

వాస్తవానికి స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రేంజ్ ఆమెది..  తమిళనాట శరత్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కూతురు సినీరంగంలోకి వస్తుందంటే ఆ అంచనాలు ఇంకో స్థాయిలో ఉంటాయి.. శరత్ కుమార్ కూడా ఆమెను ఓ మంచి సినిమాతో లాంచ్ చేయాలని అనుకున్నారు. ఆయన అతి ముందు చూపు వల్ల వరలక్ష్మి శరత్ కుమార్ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ రెండు సినిమాలను గనుక ఆమె చేసుంటే ఆమె కెరీర్ ఇంకో స్థాయిలో ఉండేది.

వరలక్ష్మి శరత్ కుమార్ చదువుకుంటున్న సమయంలోనే సినిమాలలో కూడా ట్రై చేయాలని అనుకుంది. అందులో భాగంగానే పలు సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. కానీ ఎక్కడ కూడా తాను శరత్ కుమార్ కూతురునని చెప్పలేదు. ఆ సమయంలోనే దర్శకుడు శంకర్ బాయ్స్ అనే సినిమా చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ను చూసిన శంకర్.. ఆమెను ఆడిషన్స్ కి పిలిచారు.

ఆడిషన్స్ లో ఆమె కూడా సెలెక్ట్ అయింది..జెనీలియా  పాత్ర ఆమె చేయాల్సి ఉంది. కథ కూడా నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పింది. అయితే ఈ విషయం తెలుసుకున్న శరత్ కుమార్.. దర్శకుడు శంకర్ కి ఫోన్ చేసి తన కూతురు ఇప్పుడే నటించిందని.. ఇంకా చదువుకుంటుందని చెప్పి ఆ సినిమాకి మరో అమ్మాయిని తీసుకోండని చెప్పారు. దీనితో ఆ ఛాన్స్ జెనీలియాకు దక్కింది. ఈ సినిమా సక్సెస్ ఏంటో అందరికీ తెలిసిందే.

అదే సమయంలో బాయ్స్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బాలాజీ శక్తివేల్.. తాను తీయబోయే మొదటి సినిమాకి వరలక్ష్మిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. అదే కాదల్ చిత్రం.. తెలుగులో ప్రేమిస్తే చిత్రంగా విడుదలైంది. ముందుగా ఇందులో హీరోయిన్ పాత్రకు వరలక్ష్మిని అనుకున్నాడు దర్శకుడు.. కథ కూడా బాగా ఉండడంతో వరలక్ష్మి కూడా ఓకే చెప్పేసింది.. కానీ తన తండ్రి ఓకే చెబితేనే సినిమా చేస్తానని కండిషన్ పెట్టింది. అయితే శరత్ కుమార్ కి ఈ విషయం చెప్తే కచ్చితంగా తిడతాడని దర్శకుడు బాలాజీ శక్తివేల్ ఆయన దగ్గరికి కూడా వెళ్లలేదు.

ఈ సినిమా తమిళనాట, తెలుగులో ఎంత విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆ సినిమాలోని సంధ్య పాత్రలో తనని తాను చూసుకోవడం మొదలుపెట్టింది వరలక్ష్మి.. ఆ పాత్ర తాను చేసుంటే తన కెరీర్ ఇంకోలా ఉండేదని అనుకుంది. ఇక అప్పటినుంచి ఎవరిపై డిపెండ్ అవ్వకూడదని.. మనకి నచ్చిన పనిచేయాలని అనుకుంది. ఇండిపెండెంట్ గా బ్రతకాలని అనుకుంది. 

ఆ తర్వాత శింబు హీరోగా వచ్చిన పొడా పొడి అనే సినిమాని చేసింది వరలక్ష్మి.  ఇదే ఆమెకి మొదటి సినిమా.. ఈ సినిమా యావరేజ్ గా అడింది.. ఈ సినిమా తన తండ్రి అంగీకారం లేకుండానే చేసింది వరలక్ష్మి. ప్రస్తుతం ఈ నటి తమిళ్,తెలుగులో ఫుల్ బిజీగా,  మోస్ట్ వాంటెడ్ నటిగా కొనసాగుతుంది.