Jai Chiranjeeva : త్రివిక్రమ్, విజయ భాస్కర్ లను కలిపి విడగొట్టిన చిరు..!
Cinema Latest News

Jai Chiranjeeva : త్రివిక్రమ్, విజయ భాస్కర్ లను కలిపి విడగొట్టిన చిరు..!

Jai Chiranjeeva :  ఇండస్ట్రీలో కొన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్ లు ఉంటాయి. అందులో ఒకటి విజయ భాస్కర్, త్రివిక్రమ్. స్వయంవరం లాంటి సక్సెస్ మూవీతో మొదలైన వీరి కాంబినేషన్… జై చిరంజీవ(Jai Chiranjeeva ) లాంటి ఫ్లాప్ మూవీతో ముగిసింది. మన్మధుడు మూవీ తరవాత వీరితో సినిమా చేయాలని చిరంజీవి అనుకున్నారు. కానీ అప్పటికే త్రివిక్రమ్ రైటర్ నుండి డైరెక్టర్ అయిపోయారు. మళ్లీ వీరి కాంబినేషన్ను మురళీమహన్ సహాయంతో చిరు కలిపారు. కానీ అప్పటికి కథ కూడా సిద్ధంగా లేదు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అశ్వినిదత్ టీమ్ దగ్గర ఉన్న చిన్న లైన్ తో కథను స్టార్ట్ చేశారు.

తన కూతురు యాక్సిడెంటల్ గా చనిపోయిందని బాధపడే ఓ తండ్రికి అది యాక్సిడెంటల్ గా కాదు.. ఓ కిరాతకుడు టైం పాస్ కు చంపేశాడని తెలుసుకుని ఆ కిరాతకుడుపై అతను ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నది లైన్. ఇది అటు ఇటుగా చూడాలని ఉంది మూవీ లాగే ఉండడంతో తండ్రిని కాస్త మేనమామగా మార్చి దీనికి కాస్త కామెడీ టచ్ చేసి స్క్రిప్ట్ రెఢీ చేశారు త్రివిక్రమ్. ముందు నుండి ఈ స్క్రిప్ట్ ఆడదని తెలిసినప్పటికి చిరు లాంటి హీరోతో మూవీ అనేసరికి ఏం కాదనలేక సినిమాని త్రివిక్రమ్ , విజయ భాస్కర్ చేశారట.

ఇక ముందుగా ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చిరు అనుకుంటే.. కోటీ అని త్రివిక్రమ్, విజయ భాస్కర్ అనుకున్నారట. ఫైనల్ గా తనకు బాగా అచ్చొచ్చిన మణిశర్మకు దత్తు ఓటు వేయడంతో మణిశర్మ ఫైనల్ అయ్యారు. తీరా మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి రేంజ్ కి తగ్గ మూవీ కాదని జై చిరంజీవ తేల్చేసింది. దీంతో త్రివిక్రమ్, విజయ భాస్కర్ చెరో దారి చూసుకున్నారు. ఇలా చిరుతో మూవీ అనేసరికి చేతులు కాల్చుకున్న మరో డైరెక్టర్ శ్రీను వైట్ల.. స్టోరీ విన్నాక ఆడదని తెలిసి కూడా మెగాస్టార్ తో అందరివాడు అనే మూవీ చేశారు శ్రీను వైట్ల.

Also Read :