Jai Bhim : సినిమా లవర్స్ ఎక్కడ కలిసిన ఒకే మాట.. అదే ‘జైభీమ్'(Jai Bhim).. సినిమాకి భీభత్సంగా కనెక్ట్ అయిపోయారు.. మౌత్ టాక్ సినిమాకి బాగా ప్లస్ అయిపొయింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే పోస్ట్‌లు కూడా.. తమిళనాడు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా స్టార్ హీరో సూర్య మెయిన్ లీడ్ లో కనిపించారు.
దీపావళి సందర్భంగా ఓటీటీ సంస్థ ఆమెజాన్ ప్రైంలో విడుదలై దూసుకుపోతోంది. ఒక్క ముక్కలో ఈ సినిమా కథేంటో చెప్పాలంటే.. ఓ కేసులో అరెస్టు అయిన తన భర్త కనిపించకపోవడంతో అతడిని కనిపెట్టేందుకు, అతడి మరణానికి కారణం ఎవరో తెలుసుకునేందుకు ఓ గర్భిణీ మహిళ చేసిన పోరాటమే ఈ సినిమా.
ఈ చిత్రంలో భర్త కోసం పోరాటం చేసే భార్య ‘సినతల్లి’ పాత్రలో నటించి ఆకట్టుకుంది నటి లిజోమోల్ జోస్.. దీనితో ఈమె ఎవరని నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు.
లిజోమోల్ జోస్ కేరళకి చెందిన అమ్మాయి. సినిమాల్లోకి రాకముందు అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అక్కడే లోకల్‌గా ఓ మీడియా ఛానల్ లో పనిచేసింది. ఫ్రెండ్ సలహాతో ఓ సినిమా ఆడిషన్‌కి వెళ్లి సెలెక్ట్ అయింది.
అదే ఫహద్ ఫాజిల్ నటించిన ‘మహాశింబే ప్రతీకారం’.. ఇదే ఆమెకి మొదటి సినిమా .. ఇక 2016లో వచ్చిన ‘రిత్విక్ రోషన్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ సినిమాతో మలయాళ స్టార్ నటిగా ఎదిగింది.
తాజాగా సిద్దార్థ్ హీరోగా వచ్చిన మంజల్ పచ్చాయ్’ (ఒరేయ్ బామ్మర్ది)లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాని చూసిన దర్శకుడు జ్ఞానవేల్ ‘జై భీమ్’లో అవకాశం ఇచ్చారు. వచ్బిన అవకాశాన్ని బాగా వాడుకుంది.
అప్పటివరకు ఎంతోకొద్దిగా గ్లామర్ పాత్రలో కనిపించిన ఆమె.. జైభీమ్ కోసం మొత్తం మేకోవర్ ,మార్చేసుకొని డీ గ్లామర్‌గా రోల్ కనిపించి మెప్పించి ప్రశంసలు అందుకుంటుంది.
ఇక ఆమె తన బంధువు, స్నేహితుడైన అరుణ్ అంటోనీని అక్టోబర్ 5న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది.
Also Read :
- Anasuya Bharadwaj : అనసూయత్త.. ఎంత సక్కగున్నావో…!
- Amrutha Pranay : పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమృత ప్రణయ్.. దీపావళి స్పెషల్ సాంగ్..!
- Janhvi Kapoor : అబ్బా జాన్వీ… ఎన్ని రోజులైంది నిన్ను ఇలా చూసి..!