Himaja : రెండో భర్తకి హిమజ విడాకులు.. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అయిందమ్మా?
Cinema Latest

Himaja : రెండో భర్తకి హిమజ విడాకులు.. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అయిందమ్మా?

Himaja : సినీ ఇండస్ట్రీలో విడాకులు అన్నది ఇప్పుడు కామన్ అయిపొయింది. ఇప్పటికే టాలీవుడ్‌‌లో చైసామ్, కోలీవుడ్‌‌లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా బిగ్‌‌బాస్ బ్యూటీ హిమజ(Himaja ) తన భర్తతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

నిజానికి హిమజకి పెళ్లి అయిందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. హిమజ ఎక్కడ కుడా తన భర్త గురించి కానీ పెళ్లి గురించి కానీ ప్రస్తావించలేదు. అయితే 2012లోనే రాజేష్‌ ఆనంద్‌ అనే బిజినెస్‌‌‌మెన్‌‌ని హిమజ పెళ్లి చేసుకున్నట్టుగా గూగుల్ చూపిస్తోంది.

అతనితో విభేదాలు రావడంతో విడిపోయిందని, ఆ తర్వాత చల్లా విజయ్‌‌‌రెడ్డి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు అతనికి కూడా త్వరలోనే హిమజ విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందని ప్రచారం జోరుగా నడుస్తోంది.

అసలు హిమజకి పెళ్లి అయిందా? ఈ విడాకుల గోల ఏంటి? దీనిపైన క్లారిటీ రావాలంటే హిమజ స్పందించక తప్పదు.. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Also Read :