home page

ఎవరీ 'బింబిసార'.. ఏంటా చరిత్ర ?  కళ్యాణ్ రామ్ పెద్ద రిస్క్ చేస్తున్నాడేమో..!

 | 
kalyan Ram
నటుడుగా, నిర్మాతగా రిస్క్ చేయడం మొదటి నుంచి ఓ హాబిట్ గా పెట్టునుకున్నాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. అయితే ఇవి ఎక్కువగా నష్టాలనే ఇచ్చాయి.. అయినప్పటికీ మొండిగానే వెళ్తుంటారాయన. అందులో భాగంగానే తనకి ఇమేజ్ కి భిన్నంగా 'బింబిసార'  అనే ఓ పిరియడికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 


ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే టాపిక్.. అసలు ఎవరీ బింబిసార.. ఏంటీ ఆయన చరిత్ర అనే అసక్తి నెలకొంది. ఆయన గురించి పుస్తకాలు తీరగేస్తుంటే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. అందులో కొన్ని.


1. బింబసారుడు మగధ సామ్రాజ్యానికి చెందిన రాజు.. క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో ఆయన మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 

2. హర్యంక రాజ్య వంశానికి చెందిన ఈయన..భట్టియా కుమారుడు. పదిహేనేళ్ల పిన్న వయసులోనే ఆయన సింహాసనాన్ని అధిష్టించారు.

3. మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని రాజగృహ (రాజగిరి). ఆ తర్వాత పాటలీపుత్ర (పాట్నా) రాజధానిగా చేసుకొని పాలించారు. 

4. బింబిసారా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి వివాహ సంబంధాలను ఉపయోగించారు. అందుకే ఆయన దాదాపుగా 500 పెళ్లిళ్లు చేసుకున్నారని మహావగ్గ వర్ణించాడు. 

ఆయన మొదటి భార్య కోసల దేవి...
రెండవ భార్య చెల్లన.. 
మూడవ భార్య క్షేమ.. 

ఇలా ఆయన 500 మందిని పెల్లిచేసుకున్నడాట..

5. మగధ రాజ్యం సింహాసనాన్ని అధిరోహించడానికి ఆయన కుమారుడు అజాతశత్రు ఆయనను ఖైదు చేసాడు. అజతశత్రు తన మొదటి బిడ్డ పుట్టిన తరువాత తండ్రిని విడుదల చేయాలని ఆదేశించాడు. కానీ అప్పటికి బింబిసార మరణించాడు. 

6. ప్రశాంతతకు ఆకర్షితుడైన బింబిసార జైనమత భక్తుడిగా మారాడు.

7. దాదాపుగా బింబిసార 52 సంవత్సరాలు మగధ రాజ్యాన్ని పాలించాడని చరిత్ర చెబుతుంది. 


ఇలాంటి గొప్ప రాజు కథను పెద్దగా మార్కెట్ వాల్యూ లేని కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. అప్పుడే ఈ సినిమాకి బాహుబలితో కూడా పోలికలు మొదలయ్యాయి. ఇన్ని అంచనాలను అందుకోవడం కళ్యాణ్ రామ్ కి  పెద్ద టాస్క్ మళ్లీ రిస్క్ అంటున్నారు సినీ విశ్లేషకులు.