Rashmi Gautam : యాంకర్ రష్మీ.. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఆ మధ్య “రాణి గారి బంగ్లా” మూవీ చేస్తున్న టైంలో ఏకంగా నిర్మాతనే బెదిరించిందట.. ఈ విషయాన్నీ స్వయంగా ఆ మూవీ ప్రొడ్యూసర్ బాలజీ నాగలింగం బయటపెట్టాడు.. ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ.. రాణి గారి బంగ్లా మూవీ సమయంలో తాను రష్మీ(Rashmi Gautam)ని బెదిరించానని చెప్పాడు.. అయితే అలా ఎందుకు చెయాల్సి వచ్చిందో వివరించాడు.
రాణి గారి బంగ్లా మూవీ చేసేందుకు రష్మీ ఒప్పుకుంది.రెమ్యునరేషన్ కూడా ఇచ్చేశాను ఓ పాట, డబ్బింగ్ కి వచ్చేసరికి చేయను అంటూ ఇబ్బంది పెట్టింది. 90శాతం మూవీ అయిపోయాక హీరోని మార్చాలంటూ డిమాండ్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని మాట్లాడేందుకు ప్రయత్నించాను.. ఎలాగోలా మూవీ నుంచి తప్పుకోవడానికి నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసునని టీవీ9కి చెప్తానంటూ తనని బెదిరించిందని చెప్పుకొచ్చాడు.
అయితే తనకు కూడా నాగబాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ఎంతొమంది తెలుసు అన్నానని ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతానని రష్మీతో అన్నట్లు చెప్పాడు. చివరికి అక్కడ ఇక్కడ తన గురించి తెలుసుకొని మూవీ ఫినిష్ చేసిందని తెలిపాడు.. ఒకవేళ మూవీని మధ్యలో వదిలేస్తే ఆమె పై న్యాయపరమైన చర్యలు దిగుతానని, అలాగే ఫిల్మ్ చాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించినట్లుగా తెలిపారు బాలాజీ నాగలింగం.
ఇక రష్మీ మంచి యాక్టర్ అని సినిమా మొత్తంలో సెకండ్ షాట్ అడగలేదని, ఫస్ట్ షాట్ లోనే సీన్ ని కంప్లీట్ చేసేదని తెలిపాడు.
Also Read :