Bangarraju : బంగార్రాజుకి ఫుల్ గ్లామర్.. ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు..!
Cinema Latest

Bangarraju : బంగార్రాజుకి ఫుల్ గ్లామర్.. ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు..!

Bangarraju : సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ బంగార్రాజు(Bangarraju ).. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో పైన అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. నాగచైతన్య, నాగార్జున, రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ఏకంగా ఎనమిది మంది హీరోయిన్లు సందడి చేయనున్నారట. రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ హీరోయిన్లు కాగా, ఫరియా అబ్దుల్లా ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.

Image

ఇక వీరితో పాటుగా మీనాక్షి దీక్షిత్‌, దర్శన బానిక్‌, వేదిక, దక్ష నాగార్కర్‌, సిమ్రత్‌ కౌర్‌ సినిమాలో కనిపించనున్నారట. ఐతే వీరందరూ సినిమాలోని పాత్రలో కనిపిస్తారా లేకా ఓ పాటలో కనిపిస్తారా అన్నది చూడాలి.

గతంలో నాగ్ నటించిన కింగ్ సినిమాలోని ఓ పాటలో ఇండస్ట్రీలోని టాప్‌ హీరోయిన్స్‌ సందడి చేశారు. కాగా అనుబ్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న బంగార్రాజు సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Also Read :