Director Bala : విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్..!
Cinema Latest

Director Bala : విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్..!

Director Bala : తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా(Director Bala) దంపతులు విడాకులు తీసుకున్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరికి మార్చి 5న విడాకులు మంజూరు చేసింది. గత 4 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు చట్టబద్దంగా వీడిపోయారు.

దర్శకుడు బాలా, ముత్తుమలర్ జూలై 5, 2004న మధురైలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరికి ప్రార్ధన అనే పాప కూడా ఉంది. అయితే గతకొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో విడాకులకి అప్లయ్ చేయగా.. కోర్టు వీరికి విడాకులు ఇచ్చింది.

Director Bala with wife Malar and their kid snapped during the marriage ceremony of musician GV Prakash Kumar and singer Saindhavi at Mayor Ramanathan Chettiar Hall, Chennai.

వీరి విడాకుల వార్త ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ షాక్‌‌కి గురి చేసింది. సేతు’ (తెలుగులో ‘శేషు’), ‘పితామగన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’)లాంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలా.. అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

బాలా చివరిగా ధృవ్ విక్రమ్ నటించిన వర్మ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకి రీమేక్.. ప్రస్తుతం సూర్యతో ఓ సినిమాని చేస్తున్నాడు బాలా.

Also Read :