Pushpa Trailer Tease  : పుష్ప ట్రైలర్‌ టీజ్‌ చూశారు కదా.. ఈ పిల్ల గుర్తుందా మరి?
Cinema Latest

Pushpa Trailer Tease  : పుష్ప ట్రైలర్‌ టీజ్‌ చూశారు కదా.. ఈ పిల్ల గుర్తుందా మరి?

Pushpa Trailer Tease  : అల్లు అర్జున్, సుకుమార్ మూవీ అంటే అంచనాలు మాములుగా ఉండవు.. ఇప్పుడు భారీ అంచనాలతో వీరి కాంబినేషన్‌‌లో పుష్ప(Pushpa Trailer Tease) సినిమా వస్తోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్స్ సినిమా పైన బీభత్సమైన హైప్స్ క్రియేట్ చేశాయి.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ డిసెంబరు 6న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.. అయితే ఆ టీజర్ ఎలా ఉంటుందో సింపుల్‌‌‌గా ‘ట్రైలర్‌ టీజ్‌’ పేరుతో రిలీజ్ చేశారు. 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సుకుమార్ చాలానే చూపించారు.

ఇందులో చాలానే క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్‌ టీజ్‌‌‌‌లో హీరోయిన్ రష్మిక వెనుక ఇద్దరమ్మాయిలున్నారు. అందులో ఓ అమ్మాయి ఇప్పుడు హాట్ టాపిక్‌‌‌‌‌గా మారింది. ఇంతకీ అ అమ్మాయి ఎవరంటే… దివ్యశ్రీపాద.. ఈ పేరుతో చెబితే కొంచం కష్టమేలే గుర్తుపట్టడం.

Image

 

గత ఏడాది సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌‌‌‌గా నటించింది. దీనికి ముందు ఆమె చాలానే షార్ట్ ఫిలిమ్స్‌‌‌లో నటించింది. చాయ్ బిస్కెట్ ఛానల్ ద్వారా వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ ఆమెకి మంచి పేరును తీసుకొచ్చాయి. ఇక కలర్ ఫోటోతో పాటుగా మిడిల్ క్లాస్ అబ్బాయి, హెడ్స్ అండ్ టేల్స్ చిత్రాలలో ఆమె నటించింది.

ఇప్పుడు పంచతంత్రం అనే సినిమాలో దేవి అనే పాత్రలో అలరించబోతోంది. ఈ క్రమంలో ఆమెకి పుష్పలో ఛాన్స్ వచ్చింది. అయితే ఆమె రోల్ ఏంటి అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌‌‌గా నటిస్తోంది.

సునీల్‌, ఫాహద్‌ ఫాజిల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. డిసెంబరు 17న సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది.

Also Read :