Criticism over pushpa movie : 1. ఫోర్స్ చేయడాన్ని, అమ్మాయికి ఇష్టం లేదని గింజుకుంటున్నా, ఆమెను అదిమి పెట్టి మరీ ఆమె వద్దంటున్న చోట బలవంతంగా తాకడాన్ని heroism లా glorify చేయడం ఎప్పటికి ఆపుతారు? పైపెచ్చు దాన్ని రొమాన్స్ లా చూపించడం ఒకటా?
- బలవంతంగా తనని తాకుతున్న అబ్బాయిని ఎలాగోలా విదిలించుకుని దూరం జరిగితే, తను చేయాలనుకున్నది ఆ అమ్మాయి చేయనివ్వనందుకు మొహం మాడ్చుకుని, మూతి ముడుచుకుని, అలిగితే …. ఆ అమ్మాయే తిరిగి ‘రా చెయ్యేసుకో ‘ అని అనడమూ… ఏమక్కర్లేదు అనే అబ్బాయిని బ్రతిమలాడుతూ అతని చేయి లాక్కుని మరీ తన ఒంటి మీద వేయించుకోడం అనేది ఆమె vulnerabilityని, అలా చేయకపోతే అతను దూరం ఐపోతాడన్న భయాన్ని చూపిస్తుంది తప్ప దీన్లో రొమాన్స్ ఎక్కడ ఉంది?
3.ఇంత కంటే కాస్త తక్కువ ఇంటెన్సిటీ తో ఆర్య 2లో లిఫ్ట్ లో కాజల్ కి forceful గా ముద్దు పెట్టే scene అప్పుడూ అనిపించింది. ఆ అమ్మాయి దాన్ని ప్రూవ్ చేయడానికి try చేస్తూ ఫూల్ అవుతూ ఉండడం, హీరో మాత్రం మంచి వాడిగా పేరు తెచ్చుకోడం… ఇదంతా ఏంటి? Atleast, ఆ movie లో Arya లో negative shade చూపించారు.
- పుష్ప లో పై సీన్, దీనికి ముందు ఉన్న ‘డబ్బులిచ్చి ముద్దు పెట్టమని ఫోర్స్’ చేసే సీన్ ఉన్నా, లేకపోయినా స్టోరీ లైన్ ఏ రకంగా impact అవ్వదు. అయినా ఎందుకు పెట్టినట్టు?
ఇలాంటి scenes లో ఉన్న sexist approachని కనీసం recognise చేయలేనంత మొద్దుబారి పోయి ఉన్నాం కాబట్టా?
అలాంటి characterని, ఆ character చేసే పనులని heroicగానూ, అది హీరో పవర్, strengthకి నిదర్శనం గానూ ఫీల్ అవుతాం కాబట్టా?
‘ఇది ఎప్పుడూ ఉన్నదే, సినిమాల్లోనూ, నిజ జీవితాల్లోనూ… ఏం తేడాగా చూపించారు? సినిమా ని సినిమా లా చూడండి… బొక్కలెతక్కండి’ అని చెపుతూ ఇలాంటి వాటిని వెనకేసుకొచ్చే వాళ్ళుంటారు కాబట్టా?
ఇలా ఆడవాళ్లను వాళ్ళకిష్టం లేకుండా తాకడం మగతనం, heroismగా గుర్తించకుండా, ఇప్పుడిప్పుడే మీసాలొస్తున్న మగపిల్లలు అమ్మాయిలతో ఎక్కడ respectful గా behave చేసేసి, తరాలుగా వస్తున్న ఈ ఫోర్స్ చేసి సాధించుకునే సంస్కృతిని నాశనం చేసేస్తారనే భయం ఉంది కాబట్టా?
అసలిలాంటి scenes ని positive angle లో ఇంకా ఎంత కాలం చూపిస్తారు??
P.S: బాలకృష్ణ అఖండని ఏమీ అనలేదు, మా హీరో సినిమాని అంటున్నారు అని వచ్చే ఫాన్స్ కి చిన్న రిక్వెస్ట్! Sukumar cinema కాబట్టి మూవీ చూసే ధైర్యం చేసాను. అఖండ లాంటి మూవీస్ చూసే ధైర్యం నేను జన్మలో చేయలేను. Sorry!
ఓ సినీ అభిమాని ఆవేదన
Read Also :
- Christmas celebrations : క్రిస్మస్ వేడుకల్లో పాట పాడిన సీఎం..!
- Omicron : జర పైలం.. తెలంగాణలో ఒమిక్రాన్ కీలక దశ..!
- Samantha : సెక్సీ సమంత వెనక అతడు..? ఎవరతను..?
- D mart : డీ మార్ట్ కస్టమర్లు ఖచ్చితంగా చదవాల్సిన వార్త
- Smriti irani : కేంద్రమంత్రికి చెంపదెబ్బ.. జ్ఞానోదయం అయ్యిందని సమాదానం
- Pushpa : పుష్పలో అనసూయ ఎంట్రీ.. నా సామీ రచ్చరంభోలానే..!
- Harnaaz Sandhu : ఎవరీ హర్నాజ్ సంధు.. ఎక్కడినుంచి వచ్చింది?
- Vemuri Radhakrishna : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై కేసు
- Cumin water : పరగడుపునే ఇది తాగారంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు