BVS Ravi : మత్సరవి దశ తిరిగింది పో..!
Cinema Latest

BVS Ravi : మత్సరవి దశ తిరిగింది పో..!

BVS Ravi : ఇండస్ట్రీలో మత్సరవి (బీవీఎస్ రవి) అంటే తెలియని వారుండరు. రచయితగా ఫుల్ పాపులరైన మనోడి పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ముందుగా డైలాగ్ రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవి(BVS Ravi).. ఆ తరువాత వాంటెడ్, జవాన్ సినిమాలతో డైరక్టర్ గా మారాడు. ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక మళ్లీ డైరక్షన్ జోలికి పోలేదు.

ఆ తరువాత నటుడి మారాడు. ఈ మధ్య రవి నటించిన మూడు సినిమాలు వందకొట్ల క్లబ్ లో చేరిపోవడంతో సోషల్ మీడియాలో మత్సరవిని ఎత్తేస్తున్నారు.  రవితేజ ధమాకా సినిమాలో పహిల్వాన్ పాత్రలో కనిపించిన రవి.. బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల్లో కనిపించాడు.

ఇప్పటికే ఈ మూడు సినిమాలు వంద కోట్ల షేర్ కూడా దాటేశాయి. మత్సరవి బాలయ్య అన్స్టాపబుల్ షోకు రైటర్ గా కూడా వర్క్ చేస్తున్నాడు.

Also Read :