Bheemla Nayak Style: పవన్.. ఏందయ్యా ఆ బుల్లెట్లు..? నీతి సూక్తులు అదుర్స్..!
Cinema Latest

Bheemla Nayak Style: పవన్.. ఏందయ్యా ఆ బుల్లెట్లు..? నీతి సూక్తులు అదుర్స్..!

Break Time in Bheemla Nayak Style : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన దూకుడు చూపించాడు. బీమ్లా నాయక్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్.. అప్పుడే ఫ్యాన్స్ లో జోష్ పెంచేస్తున్నారు.

ఇటీవలే బీమ్లానాయక్ (Bheemla Nayak Style) మూవీకి సంబంధించి ఓ వీడియో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ ఫైట్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సింహమే ఇంటికి వచ్చి ఫైట్ చేసినట్టుగా ఉందని కామెంట్స్ పెట్టారు.

ఇప్పుడు వైట్ అండ్ వైట్ లో .. గన్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. బుల్లెట్ల వర్షం కురిపించాడు.

“యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణధారలు వదుల్తాడు..

యోధుడు తుపాకి గొటం అంచు నుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు..

నాయకుడు ఈ రెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు…” అంటూ ఫ్యాన్స్ ని మరింత ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

Read Also :