Boyapati Srinu : బోయపాటి ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ .. పరువు తీశావు కదయ్యా..!
Cinema Latest

Boyapati Srinu : బోయపాటి ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ .. పరువు తీశావు కదయ్యా..!

Boyapati Srinu : కథకి హీరో ఎంత బలంగా ఉండాలో విలన్ కూడా అంతే బలంగా ఉండాలి.. అప్పుడే హీరో ఎలివేషన్ అనేది ఇంకో లెవల్‌‌‌‌లో ఉంటుంది. దీనిని పక్కాగా నమ్మే దర్శకుడు బోయపాటి(Boyapati Srinu).. చేసిన అన్ని సినిమాల్లో బోయపాటి అంతే పవర్ఫుల్‌‌‌గా విలన్ రోల్స్‌‌‌ని డిజైన్ చేసి బరిలోకి దింపాడు.

అన్ని సక్సెస్ అయ్యాయి కూడా.. కానీ అఖండలో బోయపాటి తన మార్క్ విలనిజం చూపించలేకపోయాడు. ఎక్కడ కూడా విలన్‌‌‌గా వరదరాజులును చూస్తున్నట్టుగా అనిపించదు. శ్రీకాంతే కనిపిస్తాడు. శ్రీకాంత్ కూడా తన వాయిస్ తో కాస్తా గంభీరంగా మాట్లాడి భయపెట్టడా అంటే అది లేదు.. మిమిక్రీ చేసినట్టుగా అనిపిస్తుంది.

Image

వేషాధారణ మార్చాడు కానీ శ్రీకాంత్‌‌‌ని సరిగ్గా మాత్రం వాడుకోలేకపోయాడు బోయపాటి. శ్రీకాంత్‌‌‌కి సినిమాలో ఉన్నది తక్కువ స్కోప్ అయినప్పటికీ బలమైన ప్రతినాయకుడిగా చూపించడంలో బోయపాటి అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఒక్కోసారి మెయిన్ విలన్ శ్రీకాంతా లేకా విలన్ గ్యాంగ్‌‌‌లో ఓ మెంబరా అన్నట్టుగా అనిపిస్తుంది. పెద్దగా తేడా కనిపించదు.

Image

ఒక్కోసారి పాత్రను సన్నివేశాలతో ఎలివేట్ చేయలేకపోయినా డైలాగ్స్‌‌‌‌‌తో ఆ పాత్ర ఎంత పవర్ఫులో చెప్పేయొచ్చు.. కానీ ఇక్కడ అది కూడా చేయలేకపోయాడు బోయపాటి. ఈ సినిమాకి మెయిన్ మైనస్ ఏదైనా ఉందంటే అది ఒక్క శ్రీకాంత్ అని బలంగా చెప్పొచ్చు.

మొత్తానికి విలన్‌‌‌‌ని భయంకరంగా, కథానాయకుడిని ఢీ కొట్టే ప్రతినాయకుడిని పర్ఫెక్ట్‌‌‌‌గా స్క్రీన్ పైన ప్రెజెంట్ చేయడంలో బోయపాటి మొదటిసారి ఫెయిల్ అయ్యాడు.

Also Read :