Bithiri sathi  : బిత్తిరి సత్తి.. ఓ రేంజ్ రోవర్ కథ..!
Cinema Latest

Bithiri sathi : బిత్తిరి సత్తి.. ఓ రేంజ్ రోవర్ కథ..!

Bithiri sathi With his new range rover car : పూల అంగీ లాగేసుకుని.. ఎడ్డోని లెక్క మాట్లాడే ఓ వ్యక్తి రేంజ్ రోవర్ కారు కొన్నడు. దసరా నాడు రేంజ్ రోవర్ కారు(range rover car) కొన్నానని తన సోషల్ మీడియాలో పెట్టాడు బిత్తిరిసత్తి. ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. బిత్తిరి సత్తి ఏంటీ..? రేంజ్ రోవర్ కారు కొనడం ఏంటీ అని..?

రేంజ్ రోవర్ కారు ఏదో అల్లా టప్పా కాదు. సంపన్న వర్గాలు మాత్రమే కొనగలిగే.. తిరిగే కారు అది. స్టార్టింగ్ ధరే కోటి వరకు ఉంటుంది. అలాంటిది ఓ సామాన్యుడు… మొన్నటి దాకా నెల జీతానికి వివిధ ఛానళ్లలో పనిచేసిన బిత్తిరిసత్తి ఎలా కొన్నాడనేది చాలా మందికి అంతుపట్టడం లేదు.

ఇలాంటి అనుమానాలకు ఓ కారణముంది.

సరిగ్గా 8 ఏళ్ల క్రితం బిత్తిరి సత్తి అలియాస్ రవి కుమార్(Bithiri sathi) ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఓ ఛానల్ లో నర్సయ్య తాత గెటప్ తో ఓ ప్రోగ్రాం చేసేవాడు. నర్సయ్య తాత క్యారెక్టర్ వేసింది ఈయనే అంటే కూడా ఎవరూ గుర్తుపట్టరు. అప్పటికే డబ్బింగ్ లు చెప్పడం, పాటలు పాడటం చేస్తుండేవాడు. కానీ అప్పుడు ఆయన ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. ఆయన పనిచేసిన చోట సరిగా జీతాలు కూడా వచ్చేవి కాదు.

Bithiri sathi With his new range rover car
రేంజ్ కారు తీసుకుంటున్న బిత్తిరి సత్తి, ఫ్యామిలీ

సినిమాల్లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన సందర్భాలు.. అవమానపడిన సందర్భాలు చాలా ఉన్నాయని గతంలో చాలాసార్లు బిత్తిరి సత్తి చెప్పారు.

అయితే.. ఆయన ఎప్పుడైతే వీ6 ఛానల్(v6news) లో చేరారో.. బిత్తిరి సత్తి(Bithiri sathi)గా స్క్రీన్ పై కనిపించారో.. అప్పటి నుంచి ఆయన దశ మారిపోయిందనే చెప్పాలి. అంతకుముందు ఓ న్యూస్ ఛానల్లో పనిచేసినా ఆయనెవరో చాలా మందికి తెలియదు. కానీ వీ6 స్క్రీన్ పై బిత్తిరి సత్తిగా కనిపించగానే అతితక్కువ కాలంలోనే మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతీ ఒక్కరికి ఆయన సుపరిచితుడు అయ్యాడు. ఒక్కరోజు స్క్రీన్ పై కనిపించకపోతే ఎందుకు రాలేదని ప్రేక్షకులు ఎంక్వైరీ చేసే స్థాయికి పెరిగింది.

Bithiri sathi With his new range rover car-1

ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు.. వేరే ఛానల్స్ కి మారడం.. ఒకప్పుడు 30 నుంచి 40 వేలు రావడమే గగనమైన రోజుల నుంచి నెలకు లక్షల్లో జీతం తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఎంత ఖర్చు అయినా ఫర్లేదు సత్తి స్క్రీన్ మీద కనబడితే చాలు అని చాలా ఛానళ్లు ఆయన వెంట పడే పరిస్థితి వచ్చింది.

చాలా కాలంగా ఆయనకు వ్యవసాయం ఉంది. అధునిక విధానంలో వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు.. యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. వాటి నుంచి ఆదాయం భారీగానే వస్తోంది. ప్రస్తుతం సినిమావాళ్ల ఇంటర్వ్యూలు చేయాలన్నా బిత్తిరి సత్తి(Bithiri sathi)కే ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా అవకాశాలు ఉండనే ఉన్నాయి. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.

bithiri sathi

కష్టపడితే సాధించలేనది ఏదీ ఉండదు. కాకపోతే.. దానికోసం కొద్దిరోజులు వేచి చూడాలి. ఆ టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు అనడానికి బిత్తిరి సత్తి జీవితమే నిదర్శనం. 8 ఏళ్లలో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. నెల జీతం మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఇప్పుడు పది మందికి ఆయనే ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు.

అందుకే.. జీవితంలో ఇబ్బందులు పడుతున్నామని ఎప్పుడూ అనుకోవద్దు. కష్టపడుతూనే ఉంటే మన జీవితాన్ని మలుపుతిప్పే రోజు.. మనం కోసం వేచి చూస్తూ ఉంటుంది. అప్పటి దాకా ఓపికతో ఉండటమే ముఖ్యం.

Read Also :