Biggboss 5 Telugu : ఆగస్ట్‌ 15న బిగ్ సర్‌ప్రైజ్‌.. మొదలయ్యేది అప్పుడే.. !
Cinema Latest

Biggboss 5 Telugu : ఆగస్ట్‌ 15న బిగ్ సర్‌ప్రైజ్‌.. మొదలయ్యేది అప్పుడే.. !

Biggboss 5 Telugu : బుల్లితెర పై బిగ్ బాస్(Biggboss) షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే నాలుగు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఐదో సీజన్ కి ముస్తాబవుతుంది. ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు చెక్‌ పెడుతూ తాజాగా ప్రోమో వదిలారు నిర్వాహకులు.

అయితే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో ప్రోమోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట. ఇప్పటికే ప్రోమోని కంప్లీట్ చేయగా, షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎంపిక కూడా పూర్తి అయినట్టు సమాచారం.

వారిని ఆగస్ట్‌ 22 నుంచి వారికి క్వారంటైన్‌కు తరలించనున్నట్లు సమాచారం. ప్రతి కంటెస్టెంట్‌కి రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతేహౌస్‌లోకి పంపనున్నారట. ఇదిలావుండగా ఎప్పటిలాగే కంటెస్టెంట్స్‌ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటివారంలో షో మొదలయ్యే అవకాశం ఉంది.

Also Read :