Bigg BossTelugu 5 : 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5(Bigg BossTelugu 5) నిన్న అట్టహాసంగా మొదలైంది. కింగ్ నాగార్జుననే ముచ్చటగా మూడోసారి షోని హోస్ట్ చేస్తున్నారు. హౌస్ లోకి కంటెస్టెంట్లు అలా అడుగుపెట్టారో లేదో ఇలా నామినేషన్స్ మొదలయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ప్రోమోని కాస్త వేడివేడిగానే ఉంది.
ఈ ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ తాము నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫేస్ ఉన్న బ్యాగును చెత్తడబ్బాలో వేస్తున్నట్టుగా చూపించారు. అయితే ఎందుకు నామినేట్ చేస్తున్నారో రీజన్ చెబుతుంటే దీనిని కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే మరికొందరు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు.
అందులో భాగంగానే లోబో.. రవిని నామినేట్ చేస్తూ .. నీ యాటిట్యూడ్ సక్కగా చూసుకో అని కాస్త స్ట్రాంగ్‌గానే వార్నింగ్ ఇచ్చాడు. ఇక తనవంతు వచ్చాక మాత్రం రవి.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేస్తూ మిమ్మల్ని చూస్తుంటే స్ట్రిక్ట్‌గా అనిపిస్తోందని చెప్పాడు. అయితే తనకు నటించడం రాదని రివర్స్ కౌంటరిచ్చాడు నటరాజ్ మాస్టర్.
ఇంతవరకు బాగానే ఉన్న విశ్వ, జెస్సీల మధ్య అయితే మాటల యుద్ధం నడిచింది. ఇక నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ అమాయకత్వం ఉంటే తొక్కేస్తారు అంటూ జెస్సీని నామినేట్ చేశాడు. దీనితో జెస్సీ ఏడ్చేశాడు. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవుతారన్నది చూడాలి మరి.. మొదట్లోనే ఇంత డోస్ పెంచిన బిగ్‌బాస్ షోని మరింతగా రక్తి కట్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
Also Read :
- Biggboss 5: దొంగతనం నుంచి బిగ్ బాస్ వరకు.. లోబో పనులు ఊహాతీతం..!
- Eatela rajender : రందిపడకు రాజేందరన్న… మల్ల కోళ్ల ఫారమే దిక్కైతదా అన్న..!
- Weather forecast : ఇంట్లకెళ్లి బయటకు ఎల్లకున్రి.. మీకే మంచిది..!
- Bigg Boss 5 Telugu : ‘రవివర్మ గీచిన బొమ్మలా’.. నాగ్ నే ప్లాట్ చేసేసింది..!
- Rashi Singh : తడిసిన బట్టలతో మెరిసిన అందాలు.. !