Cinema Latest

పెళ్లి సందడి హీరోయిన్ కి బిగ్ షాక్… ‘శ్రీలీల’ తన కూతురు కాదంటూ కోర్టులో కేసు.. !

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం పెళ్లి సందడి.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది..

ఇదిలా ఉంటే హీరోయిన్ శ్రీలీల వివాదంలో చిక్కుకుంది. అసలు శ్రీలీల తన కూతురు కాదు అంటూ ప్రముఖ బిజినెస్ మాన్ సూరపనేని శుభాకరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… నా మాజీ భార్యతో నేను విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చిందని అన్నారు.

తన ఆస్తులను క్లైమ్ చేయడానికి సినిమా ప్రమోషన్ లో తన పేరు వాడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను న్యాయపరంగా కోర్టుకు వెళ్తానని వెల్లడించారు.

ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.