ఈ ముగ్గురు హీరోల టర్నింగ్ పాయింట్‌‌‌లో ఒకే హీరోయిన్‌‌.. !
Cinema Latest

ఈ ముగ్గురు హీరోల టర్నింగ్ పాయింట్‌‌‌లో ఒకే హీరోయిన్‌‌.. !

టాలీవుడ్‌లో స్టార్ హీరోలైన పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ బ్యాక్‌గ్రౌండ్ తోనే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ కష్టపడి క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఏ హీరోకైనా మలుపు తిప్పే సినిమాలు కొన్ని ఉంటాయి.

ఆ సినిమాలే ఆ హీరోల ఇమేజ్‌‌ని అమాంతం పైకి తీసుకెళ్తుంది. అలా ఈ ముగ్గురి కెరీర్‌‌ని మలుపు తిప్పిన సినిమాలు ఖుషి, ఒక్కడు, సింహాద్రి.. అయితే ఈ మూడు సినిమాలు వారికి ఏడో చిత్రం కావడం విశేషం. కాగా… ఈ మూడు సినిమాలలో హీరోయిన్ భూమిక కావడం మరో విశేషం.

Bhumika Chawla, bhumika, actress, indian, tamil, chawla, south, HD wallpaper

1. సింహాద్రి
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రెండో చిత్రం సింహాద్రి. వీరి కాంబినేషన్‌‌‌లో వచ్చిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 మంచి విజయాన్ని సాధించడంతో సింహాద్రి సినిమా పైన అంచనాలు పెరిగాయి. సింహాద్రి చిత్రానికి కే విజయేంద్రప్రసాద్ కథను అందించగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. భూమిక చావ్లా, అంకిత హీరోయిన్లుగా నటించారు. 2003 జూలై 9 న విడుదలైన ఈ మూవీ 29 కోట్లు వసూలు చేసింది.

2. ఖుషి
పవన్‌‌కళ్యాణ్ హీరోగా భుమిక చావ్లా హీరొయిన్‌‌గా నటించిన ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించారు. తమిళ్‌‌లో విజయ్, జ్యోతిక నటించిన చిత్రానికి ఈ సినిమా రీమేక్… ఖుషి సినిమాని ఏఎం రత్నం నిర్మించగా మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.. ఏప్రిల్ 27 2001లో విడుదలైన ఈ సినిమా 27 కోట్లు సాధించింది.

3.ఒక్కడు

గుణశేఖర్, మహేష్‌‌బాబు కాంబినేషన్‌‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ఒక్కడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌‌లో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. భూమిక చావ్లా హీరోయిన్‌‌గా నటించింది. మహేష్‌‌కు స్టార్ డం తెచ్చిపెట్టిన చిత్రం ఒక్కడు.

అయితే…ఈ చిత్రాల తర్వాత వీరికి వరుసగా ప్లాప్స్ ఎదురవ్వగా, మళ్ళీ ఇలాంటి హిట్ రావడానికి చాలా కాలమే పట్టింది.

Also Read :

Credit : Sandeep Aggoju