Bellamkonda Suresh : అయ్యా కొడుకుల పై చీటింగ్ కేసు..!
Cinema Latest

Bellamkonda Suresh : అయ్యా కొడుకుల పై చీటింగ్ కేసు..!

Bellamkonda Suresh :  టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh), ఆయన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. శుక్రవారం, మార్చి 11న ఫైనాన్షియర్ వీఎస్ శ్రవణ్ కుమార్‌ వీరి పైన కేసు నమోదు చేశాడు.

ఇక వివరాల్లోకి వెళితే, 2018-19లో శ్రవణ్ కుమార్ నుండి తండ్రీ కొడుకులు ఇద్దరూ రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నారట.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాని తీస్తున్నామని చెప్పి తన దగ్గరి నుంచి రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నారని శ్రవణ్ కుమార్‌ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే సినిమా ఎంతకి స్టార్ట్ కాకపోవడం, తిరిగి డబ్బు ఇవ్వండి అని కోరితే బెదిరించారని శ్రవణ్ పేర్కొన్నాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణకు హాజరు కావాలని బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌లకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. అలాగే త్వరలో ఓ స్టార్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు సమాచారం.

Also Read :