Naga chaitanya Samantha divorce : సమంతకి ‘అక్కినేని’ ఫ్యామిలీతో ఎక్కడ బెడిసి కొట్టింది?
Cinema Latest Off Beat

Naga chaitanya Samantha divorce : సమంతకి ‘అక్కినేని’ ఫ్యామిలీతో ఎక్కడ బెడిసి కొట్టింది?

Naga chaitanya Samantha divorce : గాలి వార్తలే నిజమయ్యాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ టాలీవుడ్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత(Naga chaitanya Samantha divorce ) విడాకులను ప్రకటించారు. విడిపోతున్నామని ఓకే వేదిక పైన ఒకే విధంగా స్పందించారు.

పదేళ్ల స్నేహబంధం ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని, భార్యాభర్తలుగా దూరంగా ఉంటూ భవిష్యత్తులో స్నేహితులుగా ఉంటామని తెలిపారు. అయితే ఎందుకు విడిపోతున్నారు అన్నది మాత్రం వెల్లడించలేదు. దీనితో వీరిద్దరి బ్రేకప్ పైన సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి, రామానాయుడు ఫ్యామిలీకి మంచి పేరుంది. ఈ రెండు ఫ్యామిలీస్ లో లేడీస్ అయితే పెద్దగా బయట కనిపించరు. నాగార్జున రెండో భార్య అమల సినీ హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత సినీ రంగానికి గుడ్ బై చెప్పేసింది. హౌజ్ వైఫ్ గానే కొనసాగుతుంది. బయటకు ఎప్పుడైనా వచ్చిన సంప్రదాయ పద్ధతిలోనే కనిపిస్తుంది.

ఇదే పద్దతిలో వచ్చే కోడలను అంచనా వేసింది అక్కినేని ఫ్యామిలీ.. ప్రేమ వివాహం అయినప్పటికీ ఒకే చెప్పారు. అలా గొప్పింటి కొడలైంది సమంత.. ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్ ఇమేజ్ ని సొంత చేసుకుంది. చైతూతో పెళ్ళయ్యే నాటికి సమంత స్టార్ హీరోయిన్ కూడా.. బేసిక్ గా ఇలా స్వయంగా ఎదిగిన వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సమంతకి కూడా అంతే.

సమంత పెళ్లి తరవాత కూడా సినిమాల్లో నటించింది కానీ ఎక్కడ కూడా శ్రుతి మించలేదు. కానీ తాజాగా చేసిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ , సూపర్ డిలెక్స్ , ఫోటో షూట్స్ లలో కాస్త డోస్ పెంచింది. కథని నమ్మి అవి చేసింది సమంత.. కానీ అలా ఆమె చేయడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అక్కినేని కోడలు అంటే మరో అమల లాగే చూశారు అభిమానులు. కానీ సమంత అలా లేకపోవడంతో ఆమె పై విపరీతంగా ట్రోల్స్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.

ఇది అక్కినేని ఫ్యామిలీ దాకా వెళ్లిందట.. ఓ గొప్పింటి కోడలన్నప్పుడు చెప్పిన చెప్పకున్నా కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి. అలాగే ఆ కట్టుబాట్లను పాటిస్తూ ఆ కుటుంబ గౌరవాన్ని ముందుకి తీసుకెళ్లే బాధ్యత ఆ ఇంటి కోడలు పైన ఉంటుంది. కానీ ఈ లైన్ ని సమంత బ్రేక్ చేసింది. స్టార్ హీరోయిన్ మళ్లీ స్వతహాగా సొంత నిర్ణయాలతో పైకొచ్చిన వ్యక్తి కావడంతో ఈ కటుబాట్ల మధ్య సమంత ఇమడలేకపోయింది.

చైతూ దగ్గరికి ముందుగా లవ్ ప్రపోజల్ తీసుకొచ్చిన సామ్.. విడాకుల బ్రేకప్ కూడా తీసుకొచ్చిందని టాక్.. దీంతో మూడుముళ్ల వివాహబంధం మూడేళ్లలో ముగిసింది.

Also Read :