Bandhavi Sridhar in Mahesh babu movie : సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే బ్యూటీలు.. ప్రిన్స్ పక్కన కనీసం సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినా చాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి లిస్ట్ లో ఇప్పుడు మరో భామ చేరింది.
ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీగా క్రేజ్ సంపాదించింది బాంధవి శ్రీధర్ (Bandhavi Sridhar ). మసూదలో తన నటనతో భయపెట్టినా.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం బీభత్సంగా పెరిగింది.
క్యూట్ ఫేస్.. అందమైన కళ్లు.. లేలేత పెదాల అందాలతో ఇండస్ట్రీకి మరో గ్లామర్ క్వీన్ వచ్చిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
Read Also :
అయితే.. ఈ బ్యూటీ కన్ను ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు మీద పడింది. తనతో ఓ సినిమా చేయాలని ఉందంటూ చెప్పకనే చెబుతోంది. మహేష్ బాబు నెక్ట్స్ మూవీలో బాంధవిని తీసుకోవాలంటూ ఫ్యాన్స్ చేసిన ట్వీట్లను వరుసపెట్టి మరీ ట్వీట్ చేస్తోంది ఈ బ్యూటీ. మహేష్ తో ఒక్క మూవీ చేసినా చాలంటోంది.
ఇక ఫ్యాన్స్ అయితే.. ప్రిన్స్ కు ఈ బ్యూటీ ప్రిన్సెస్ కు (Bandhavi Sridhar )పర్ ఫెక్ట్ జోడీ అంటున్నారు. గ్లామర్, హైట్, వెయిట్, ఏ రకంగా చూసినా మహేష్ కు సరిజోడి అని అంటున్నారు.
Read Also :
మరి ఈ క్యూట్ ప్రిన్సెస్ కి ప్రిన్స్ ఛాన్స్ ఇస్తారా లేదా చూడాలి.