Cinema Latest

కోటా… నీ పని నువ్వు చూసుకో.. అభిప్రాయాలు చెప్పడం మానుకో..! అనసూయ గరంగరం..!

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది తెలుగు యాంకర్ లలో అనసూయ ఒకరు.. జబర్దస్త్ లాంటి షోతో ఫుల్ పాపులర్ అయిపోయింది అనసూయ. ఇద్దరు పిల్లల తల్లి అన్నట్టే కానీ ఎక్కడ కూడా అలా కనిపించదు.. దీనికి కారణం ఆమె ఫిట్నెస్, డ్రెస్సింగ్ స్టైల్ అనే చెప్పాలి. పలుమార్లు డ్రెస్సింగ్ విషయంలో నెటిజన్లచే ట్రోల్ కి గురైంది అనసూయ.. అయినప్పటికీ ఎక్కడ కూడా తగ్గేదే .. లే అంటూనే బోల్డ్, హాట్ గా వెళ్తోంది.

తాజాగా ఆమె డ్రెస్సింగ్ విధానం పైన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్ చేశారు.. అందంతో పాటుగా టాలెంట్ ఉన్న యాంకర్ అనసూయను ఎలా ఉన్న ప్రేక్షకులు చూస్తారని..నిజానికి ఆమె నటన అంటే నాకు గౌరవం అని అన్నారు. డైలాగ్స్ బాగా చెబుతుందని, డాన్స్ కూడా బాగా చేస్తుందని అన్నారు. కానీ ఆమె డ్రెస్సింగ్ విధానం తనకి నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. కోట చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి.

అయితే కోట వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా రెస్పాండ్ అయింది.. డైరెక్ట్ గా కోటా శ్రీనివాస రావు పేరు ప్రస్తావించకుండా.. ఓ సీనియర్ నటుడు అంటూ ఫైర్ అయింది అనసూయ. ఓ సీనియర్ నటుడు నా వస్త్రధారణపై కామెంట్లు చేశాడు.అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా నీచంగా మాట్లాడ‌టం అనేది నాకు చాలా దుఃఖాన్ని క‌లిగించింది. డ్రెస్సింగ్ విధానం అది వ్యక్తిగతం… ప్రొఫెషన్ బట్టి వేసుకోవాల్సి వస్తుంది.. నా పైన కామెంట్ చేసిన సీనియర్ నటుడు తన సినిమాలలో స్త్రీలను కించపరిచిన సన్నివేశాలు ఎన్నో చేశాడు. వారిని సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోదు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

నేను ఒక పెళ్లైన మహిళని, ఇద్దరు పిల్లలున్న తల్లిని.. నా ప్రొఫెషన్ లో నేను ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నాను.. మీకు నచ్చడం లేదా? అలాగైతే మీ పని మీరు చేసుకోండి… ఇతరులపై అభిప్రాయాలు వెల్లడించడం మానుకోండి అంటూ కామెంట్స్ చేసింది అనసూయ.