Bangarraju : వాసివాడి తస్సాదియ్యా.. అంతగా లేదయ్యా బంగార్రాజు…!
Cinema Latest

Bangarraju : వాసివాడి తస్సాదియ్యా.. అంతగా లేదయ్యా బంగార్రాజు…!

Bangarraju : సంక్రాంతికి వచ్చే సినిమాల పై అంచనాలు మాములు ఉండవు.. అందులోనూ సూపర్ హిట్ అయిన సినిమాకి సీక్వెల్ అంటే ఆ అంచనాలు స్థాయిని పెంచుతుంది. ఆరేళ్ళ క్రితం సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయనా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టిన కింగ్ నాగార్జున.. ఈ సారి బంగార్రాజు(Bangarraju) అంటూ మరోసారి సంక్రాంతి బరిలో దిగాడు. ఈ సీక్వెల్‌‌కి కింగ్ తనయుడు నాగచైతన్య తోడవ్వడం సినిమాకి మరింత హైప్ ని తీసుకొచ్చింది.

సోగ్గాడే చిన్నినాయనా లాగే సింపుల్ ఫార్మట్‌‌తో తెరకెక్కింది బంగార్రాజు.. ఈ సినిమాకి కమర్షియల్ హంగులు కలిపి మంచి పండగ లాంటి సినిమాని ప్రేక్షకుల ముందు ఉంచాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఓపెన్ సీన్ స్వర్గంలో నాగార్జునతోనే మొదలుపెట్టాడు దర్శకుడు… లడ్డుందా పాట సినిమాకి మంచి ఊపుని తీసుకొస్తోంది. ఆ తరవాత చిన్నబంగార్రాజు ఎంట్రీ, కృతిశెట్టి ఎంట్రీ ఇవ్వడంతో కథ ముందుకు నడుస్తుంది. ఇక చైతూ శరీరంలోకి నాగ్ ఆత్మ ఎంట్రీ ఇవ్వడం, ఓ టెంపుల్ సీన్ ఫైట్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది.

నాగార్జున, నాగచైతన్య స్క్రీన్ పై ఒకేసారి కనిపించడం, మాస్ రోల్ కమ్ విలేజ్ బ్యాక్ గ్రాఫ్‌‌లో చైతూ ఆదరగోట్టడం, విజువల్ ఎఫెక్ట్స్ ఫస్ట్ హైఫ్‌‌కి మెయిన్ హైలెట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మూవీ కాస్త డల్ అయిపొయింది. చైతూ, కృతిల మధ్య లవ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. కానీ నాగార్జున, చైతూ కాంబో సీన్స్ ఫ్యాన్స్‌‌ని కట్టిపడేస్తాయి. ప్రీ క్లైమాక్స్ సీన్స్, క్లైమాక్స్‌‌లో నాగ్ డ్యూయల్ రోల్‌‌లో కనిపించడం సెకండ్ హాఫ్ మెయిన్ హైలెట్స్‌‌గా చెప్పుకోవచ్చు.

అయితే సినిమాకి పెద్ద మైనస్ ఏంటంటే సినిమా చూస్తున్నంత సేపు సోగ్గాడే చిన్నినాయనా సినిమా జ్ఞాపకలు గుర్తొస్తూనే ఉంటాయి. అనుబ్ రూబెన్స్ పాటలు పర్వాలేదని అనిపిస్తోంది. సత్యానంద్ స్క్రీన్ ప్లే, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వ ప్రతిభ ఒకే అనిపిస్తోంది. సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ కెమరా వర్క్.. పండగ వాతావరణాన్ని తీసుకురావడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు వినోద్.

మొత్తంగా ఫస్ట్ హాఫ్ ఒకే.. సెకండ్ హాఫ్ అబోవ్ ఆవరేజ్ తో నడిచిపోయింది బంగార్రాజు. అయితే నాగ్, చైతూ కాంబో కోసం సినిమాని ఒకసారి చూసేయోచ్చు.

Also read :