home page

 సీక్రెట్ గా పవన్ హీరోయిన్ పెళ్లి.. షాక్ లో ఫ్యాన్స్..! 

 | 
Pranitha

సినీ హీరోయిన్ ప్రణీత సుభాష్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రణీత సుభాష్. ఆదివారం అతికొద్ది మంది బంధువులు,  సన్నిహితుల సమక్షంలో బెంగళూరులో ఈ వివాహం జరిగింది కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ వివాహం జరిగినట్లు సమాచారం. 

Image

ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ప్రణీత సుభాష్ సడన్ గా పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అటు ప్రణీత భర్త నితిన్ రాజు ఎవరు? అతనీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే సర్చింగ్ కూడా మొదలైంది. కాగా తనీష్ హీరోగా వచ్చిన ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రణీత. 

Image

ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస మొదలగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంతగా అదృష్టం లేకపోవడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది.

Image