Actor kartikeya : వీళ్లిద్దరికి అక్కడ కుదిరిందట..! లక్కీ కార్తికేయ..
Cinema Latest

Actor kartikeya : వీళ్లిద్దరికి అక్కడ కుదిరిందట..! లక్కీ కార్తికేయ..

Actor kartikeya love story : RX100 హీరో కార్తికేయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిన్న అతని ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగింది.

RX100 లా దూసుకెళ్లే కార్తికేయను(Actor kartikeya )కట్టుకోబోయే అమ్మాయి ఎవరనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

కార్తికేయది లవ్ మ్యారేజా..? అరేంజ్డ్ మ్యారేజా..? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఫ్యాన్స్ కన్ప్యూజన్ ని క్లియర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు కార్తికేయ.

తన స్నేహితురాలు లోహిత.. ఇప్పుడు జీవిత భాగస్వామి కాబోతోందంటూ ట్వీట్ చేశారు. వరంగల్ నిట్ లో చదువుకుంటున్న రోజుల్లో తమ మధ్య స్నేహం కుదిరిందని చెప్పాడు కార్తికేయ. ఇప్పుడది స్నేహానికి మించిన బంధంగా మారిందని చెప్పాడు.

నచ్చిన, తాను మెచ్చిన.. తనని మెచ్చిన అమ్మాయిని మనువాడబోతున్నాడు కార్తికేయ.

Read Also: