home page

మహేష్ బాబుది విగ్గా? నిజంగా జుట్టేనా? 

 | 
మహేష్ బాబుది విగ్గా? నిజంగా జుట్టేనా?

సాధారణంగా వయసు మీద పడే కొద్ది అందం అనేది తగ్గుతూ వస్తుంది. కానీ అందుకు విరుద్ధం తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు.. వయసు పెరిగే కొద్దీ ఇంకా అందంగా తయారవుతున్నారు మహేష్ బాబు. ఏకంగా ఆయన కొడుక్కే అన్నయ్య లాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. 

అయితే మహేష్ జుట్టు పైన చాలామందికి అనుమానాలు ఉన్నాయి.. మహేష్ ది అసలు జుట్టేనా? లేకా విగ్గా అనే అపోహలున్నాయి. ఆ మధ్య దీనిపైన వాదనలు కూడా నడిచాయి. గతంలో మహేష్ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అత్యాధునిక హెయిర్‌ ప్యాచ్‌ టెక్నాలజీ ద్వారా మహేష్ తన తల మీద జుట్టు అమర్చుకున్నట్లు కొందరు చెప్తున్నారు. 

అయితే దీనిని  నాన్‌ సర్జికల్‌ హెయిర్‌ ఫిక్సింగ్ అంటారని, ఇది సహజమైన జుట్టు లాగే కనిపిస్తుందని అంటున్నారు. అతిధికి ముందు ఒకే హెయిర్ స్టైల్ తో కనిపించిన మహేష్.. ఖలేజా సినిమాతో కాస్తా లుక్ మార్చారు. మళ్ళీ వన్ నేనొక్కడినే సినిమాకి హెయిర్ స్టైల్ మార్చారు. ఇప్పుడు మరోసారి సర్కారీ వారి పాట కోసం హెయిర్ స్టైల్ మార్చబోతున్నారు మహేష్. 


ఇక ఈ హెయిర్‌ ఫిక్సింగ్‌ సిస్టమ్‌ను బాలీవుడ్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ కూడా ఫాలో అయ్యారని తెలుస్తోంది.