దిశ నిందితుల డెడ్ బాడీలకు కెమికల్ ఇంజెక్షన్లు

డెడ్ బాడీలను భద్రపరిచేందుకు మెడికల్ టెక్నిక్ లను వాడుతున్నారు. డెడ్ బాడీలకు కెమికల్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు ఒక్కో డెడ్ బాడీకి.. వారానికి ఒకటి చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.

దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితుల ఎన్ కౌంటర్ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దిశను హత్యచేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. అంతా కోరుకున్నట్టుగానే.. రెండు రోజుల్లోనే నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం తీసుకెళితే.. నిందితులు తమపై దాడి చేశారని.. అందుకే కాల్చి చంపామని పోలీసులు చెబుతున్నారు.
అయితే.. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. నిందితులను పోలీసులే కావాలని కాల్చి చంపారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ముగ్గురు సభ్యులతో జుడీషియల్ కమిటీ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. త్వరలోనే కమిటీకి ఎంక్వైరీకి రానుంది.
మరోవైపు.. ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో నిందితుల డెడ్ బాడీలకు ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. ఎన్ కౌంటర్ స్పాట్ నుంచి పాలమూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారు. తర్వాత అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి తరలించారు. అయినా.. డెడ్ బాడీలపై ఎటూ తేలకపోవడంతో.. గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.
కొద్ది రోజుల వరకు అయితే ఓకే గానీ.. ఎక్కువ రోజులు డెడ్ బాడీలను భద్రం చేయాలంటే.. ఫ్రీజర్ లతో సాధ్యం కాదు. అందుకే గాంధీ డాక్టర్లు.. డెడ్ బాడీలను భద్రపరిచేందుకు మెడికల్ టెక్నిక్ లను వాడుతున్నారు. డెడ్ బాడీలకు కెమికల్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు ఒక్కో డెడ్ బాడీకి.. వారానికి ఒకటి చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకసారి ఇంజెక్షన్ ఇస్తే.. అది వారం రోజుల వరకు పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే.. ఈ ఇంజెక్షన్ల ధర భారీగానే ఉందని చెబుతున్నారు. ఒక్కో ఇంజెక్షన్ ధర 7500. నలుగురికి కలిపి 30 వేల రూపాయలు. ఈ లెక్కన వారానికి ఒకసారి 30 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో.. వేరే ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.