చంద్రయాన్ 2 ప్రయోగానికి బ్రేక్. మళ్లీ ఎప్పుడంటే..?

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో తెలిపింది. క్రయోజనిక్ ఇంధన సరఫరాలో లోపంవల్లే ప్రయోగం వాయిదా పడినట్టు సమాచారం.

లాంచింగ్‌కు 56 నిమిషాల 24 సెకండ్లకు ముందు లాంచ్‌వెహికల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రయోగాన్ని సోమవారం నిలిపివేస్తున్నట్టు ఇస్రో వెల్లడించింది. తదుపరి ప్రయోగతేదీని త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపింది.


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 సందిగ్దత ఏర్పడింది. సాంకేతిక సమస్యల ఏర్పడటంతో ప్రయోగం వాయిదా పడింది. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగింది. అయితే ప్రయోగానికి ఇంకా 56 నిమిషాల 24 సెకన్లు ఉండగా సాంకేతిక లోపాలతో కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది.

Read Also : వరల్డ్ కప్ విన్నర్ ‘ఇంగ్లండ్’.. రిజల్ట్ ఇలా ప్రకటించారు!

Read also : బాల్ టు బాల్ డీటెయిల్స్ : సూపర్ ఓవర్ లో ఏమైందంటే..!
ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్‌లను పంపాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

ఇది కూడా చదవండి : 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావ్..?