స్మార్ట్ ఫోన్ కొంటే.. కిలో ఉల్లి ఫ్రీ అన్నడు.. ఆ తర్వాత ఏమైందో తెలుసా..?

ఉల్లిగడ్డల ఆఫర్ శరవణకు చాలా కలిసొచ్చింది. దీంతో మొబైల్ ఫోన్ల అమ్మకాలు కూడా పెరిగాయి. ఆఫర్ ప్రకటించికముందు.. రోజుకు సాధారణంగా రెండు ఫోన్లు అమ్మేవాడినని చెప్పారు శరవణ.

ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లికోసం దేశమంతా తల్లడిల్లుతోంది. తక్కువ నాణ్యత ఉన్న ఉల్లి కూడా వంద రూపాలయలకు పైగా ధర పలుకుతున్న పరిస్థితి. దీంతో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఉల్లి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు.

ONION ORICE


అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు తమిళనాడుకు చెందిన ఓ మొబైల్ షాపు యజమాని. స్మార్ట్ ఫోన్ కొనండి.. కిలో ఉల్లిగడ్డలు ఫ్రీగా పొదండి అంటూ ఆఫర్ ప్రకటించాడు. తంజావూరు జిల్లా.. పట్టుకొట్టాయ్ లోని తలయారి స్ట్రీట్ కు చెందిన STR మొబైల్స్ ఓనర్ శరవణ ఈ ప్లాన్ చేశాడు.


ఉల్లి ధరలతో ప్రజలు పడుతున్న కష్టాలు చూసే.. ఈ ఆలోచన చేశానని చెప్పాడు శరవణ. చాలామంది ఆహారంలో ఉల్లి లేకుంటే ఇబ్బంది పడతారని అందుకే ఈ ఆఫర్ ప్రకటించానని చెప్పాడు. మార్కెట్ లో ఉల్లి కిలో 140 నుంచి 160 వరకు పలుకుతోంది.


ఉల్లిగడ్డల ఆఫర్ శరవణకు చాలా కలిసొచ్చింది. దీంతో మొబైల్ ఫోన్ల అమ్మకాలు కూడా పెరిగాయి. ఆఫర్ ప్రకటించికముందు.. రోజుకు సాధారణంగా రెండు ఫోన్లు అమ్మేవాడినని చెప్పారు శరవణ. ఆఫర్ ప్రకటించడంతో ఒక్క రోజులో 8 ఫోన్లు అమ్ముడయ్యాయట. దీంతో ఫుల్ ఖుషీ అవుతున్నాడు శరవణ.