నిజంగానే బిత్తిరి సత్తి “తుపాకిరాముడు” అంత బాగుందా..?

తుపాకి రాముడు:-
మొదటి సీన్ తోనే కథ యొక్క
వృత్తాంతాన్ని పరిచయం చేస్తూ, అమ్మతనాన్ని హార్ట్ టచింగ్ గా చెప్తూ, సెంటిమెంట్ తో మొదలై ఆద్యంతం నవ్విస్తూ, ఏడిపిస్తూ, మనుషుల మధ్య ఉండే మంచితనాన్ని అనుబంధాన్ని చూపిస్తూనే మరోవైపు సమాజంలో ఎప్పటి నుండో పాతుకుపోయి, ఇప్పటికీ రగులుతున్న ఒక జ్వాల నీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించింది ” తుపాకి రాముడు” సినిమా.

“ఇది మన సినిమా”అన్నంతగా అక్కడి గ్రామస్తులు, ఇతరులు సపోర్ట్ చేసిన విధానం మన ప్రాంతంలో పుట్టిన వారి ప్రేమ ఆప్యాయతలను మరొకసారి గుర్తు చేస్తాయి.

నేటివిటీని చక్కగా వాడుకుంటూ నటన తో సంబంధం లేని వారి చేత కూడా నటింప చేస్తూ, సినిమా కోసం ఎక్కడికో పోనవసరం లేదు, ఎక్కడైనా సినిమా తీయొచ్చు అని నిరూపించిన అతి కొద్ది సినిమాలలో ఇది ఒకటి.

సాంగ్స్ లోనూ,సీన్స్ లోనూ, నైట్ ఎఫెక్ట్స్ లోనూ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

అద్భుతమైన స్క్రీన్ ప్లే మరియు మాటలు ఉండడంవల్లే సినిమా పూర్తయ్యే వరకు సీట్లకే పరిమితం అయిపోతాం. రైటర్స్ కి హాట్స్ ఆఫ్.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు పాటలు అద్భుతంగా సెట్ అవడంవల్ల, ఎటువంటి డిస్టర్బెన్స్ కి అనీజీ కి ఫీలవకుండా సినిమా చూస్తూ ఉండిపోతాం.

ఎక్సలెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమాని అందమైన బతుకమ్మలో ముస్తాబు చేశారు.
జనాలని,కళాకారులని గ్యాదర్ చేయడం, వాళ్లను మెయింటెన్ చేయడం లో ప్లానింగ్ మరియు ఎగ్జిక్యూట్ చేసిన మేనేజ్మెంట్ వాళ్ళు చాలా గ్రేట్.

కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ కి సైతం ఈ ఒక్క సినిమా చాలు ఎన్నో సినిమాలకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ పొందడానికి. పాసింగ్ నుండి పాటలు వరకు పర్ఫెక్ట్ గా నడిపించిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా గ్రేట్.
ముఖ్యంగా టీమ్ ని లీడ్ చేసిన కో-డైరెక్టర్ మరియు రైటర్ “ఆదేశ్ రవి అన్నకి” అండ్ డైరెక్టర్ ” టీ. ప్రభాకర్ సార్” కి కంగ్రాచ్యులేషన్స్.

బిత్తిరిసత్తి/రవికుమార్ ఎంత నవ్వించడు, ఏడిపించాడు. ప్రతి సీన్ ని ఫీల్ అయ్యేలా చేశాడు. ప్రియా settled అండ్ మెచ్యూర్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇద్దరికీ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దొరకడం వాళ్ళ అదృష్టం.

” తీస్తే పదిమంది చెప్పుకోవాలి” అన్న విధంగా “రసమయి బాలకిషన్ గారు” ఉన్నతమైన నిర్మాణ విలువలతో సినిమా నిర్మించారు. వీరు వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉండాలి. ఎంతోమంది కొత్త వారిని పరిచయం చేస్తూనే ఉండాలి.