తెలంగాణ, ఏపీలో బతుకమ్మ, దసరా సెలవులు ఇవే

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అనౌన్స చేసింది. మొత్తం 16 రోజులపాటు దసరా సెలవులు ఉంటాయన్న మాట.

దసరా సెలవుల విషయంలో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. తమకు సెలవులు ఎప్పుడిస్తారోనని వేచిచూస్తున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగా ప్రకటించిన సెలవుల వివరాలు మీకోసం.

తెలంగాణలో ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకూ బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు దసరా సెలవుల తేదీలు వెల్లడించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అనౌన్స చేసింది. మొత్తం 16 రోజులపాటు దసరా సెలవులు ఉంటాయన్న మాట.

తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇతర విద్యాసంస్థలకూ ఇవే సెలవులు వర్తించనున్నాయి. తిరిగి అక్టోబరు 10న కాలేజీలు రీఓపెన్ అవుతాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది అక్టోబరు 6న దుర్గాష్టమి, అక్టోబరు 7న మహర్నవమి, అక్టోబరు 8న విజయదశమి వస్తున్నాయి. ఏపీలో విద్యాశాఖ 12 రోజులు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఏపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబరు 9 వరకు విజయ దశమి సెలవులుగా ఇవ్వనున్నట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. అక్టోబరు 10 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి.