“చదువు చారెడు, బలపాలు దోసెడు”

లేనివాడికి తెలుస్తుంది దాని విలువ అంటూంటారు అనుభవఙ్ణులు. అందుకోవడానికి ఆరాటపడి చివరికి భంగపడినవాడికే తెలుస్తుంది అందనివాటి విలువ

లేనివాడికి తెలుస్తుంది దాని విలువ అంటూంటారు అనుభవఙ్ణులు. అందుకోవడానికి ఆరాటపడి చివరికి భంగపడినవాడికే తెలుస్తుంది అందనివాటి విలువ. అందని ద్రాక్ష తీయనిదనం నోరూరిస్తోంటే అందుకోలేని దాని చేతగాని తనాన్ని ఎగతాళిచేస్తామని, “అందని ద్రాక్ష పుల్లన” అని నక్క బావ బయటికి అంటోందని ఏమాత్రం అవగాహనవున్నా మనకు అర్థమవుతుంది.

ఇన్ని పార్టీల్లో కప్పగంతులేసిన పవనం ఇలా మిగిలిపోవడానికి కారణం చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోవడం. కనీసం అవగాహన పెంచుకోలేకపోవడం. సినిమాల్లోనైతే 24కళల్లోని నిపుణులు పక్కననిలబడి డైలాగురాసి, పలికించి, సౌండు మిక్స్ చేసి, డాన్సులు చేయించి, పాటలు పాడించి, యాక్షను చేయించి మేనేజ్ చేసేస్తారుగానీ వాస్తవ రాజకీయ రణక్షేత్రంలో ఇవాన్నీ కుదురుతాయా? అందుకే ఈ పరాజయాలూ, పరాభవాలు!

కుడిపక్క ఒక గొప్ప సినిమానటుడి కుటుంబం, మరోపక్క రాజకీయ అధికారంకోసం శతధా ప్రయత్నిస్తోన్న కులం అండ వున్నప్పటికీ, ముందుపక్క ఒక్క పార్టీకి వ్యతిరేకంగా వున్న అన్ని పార్టీలూ కలిసి నడిపిస్తున్నప్పటికీ, చివరిగా వెనకపక్క అరకొర చదువుకుని రోడ్లమీద వీరంగాలూచేసే యువత నిలబడినప్పటికీ పాపం ఈ పవనం ఒక్కచోటకూడా గెలవలేకపోవడం కరణం నాలుగువైపులా బలగాలు పెట్టుకున్నా మన నాయకుడికి చదువులేకపోవడమే కారణం.

మొన్నటికి మొన్న డిల్లీలోని ఒక సంస్థ వారిచేత ఎలాగోలా మేనేజ్ చేసి ప్రసంగానికి ఆహ్వానం సంపాదించారు. తీరా మాట్లాడడానికి స్తేజ్ ఎక్కబోయేంతలో మన నాయకుడిని “అరవడం, మొరగడం” గాకుండా కేవలం మాట్లాడమని అనౌన్స్ చేశారంటే మనోడిపట్ల బయట ఎట్లాంటి అవగాహన వుందో అర్థమవుతుంది! ఇగ గిట్టనోళ్లు ఎలాగూ వుంటారు, విదేశీ పర్యటనల్లో వున్నప్పుడు ఏ ఇంగ్లిష్‌వాడితోనో ఇంటర్వూలో మనోడికి అతదు మాట్లాడే భాష అర్థంకాక, అర్థమైనా దాన్ని వ్యక్తపరిచే భాష లేక, పక్కన నాదెళ్ల మనోహరుడిచేత పరిస్తితి నెగ్గుకువచ్చే వీడియోలు బయటికితీసి పబ్లిక్కులో పెట్టడానికి!

నిజానికి ఇట్లాంటి చదువుతక్కువవాడు కాబట్టే ఈ రాష్ట్రంలో తామరతంపరగా పెరిగిన ఇతనికన్నా చదువుతక్కువ యువతీయువకులకు అభిమాన నటుడు, నాయకుడు కాగలిగాడన్నది వేరేవిషయం. అయితే ఇట్లాంటి చదువుతక్కువ వాళ్లని వెనకేసుకున్నాడు కాబట్టే నానాటికీ తీసికట్టు నాగంబొట్లుగా తయారవుతున్నాడనేది మరోవిషయం. అప్పటికీ బస్సు కిటికోల్లోంచి పుస్తకాలు చూపడం, మీటింగుల్లో పుస్తకాలుపట్టుకుని వూగిపోతూ మాట్లాడడం, తోటల్లో నల్లకళ్ళద్దాలతో తెల్లని పేజీలమీద నల్లని అక్షరాలు చదివే ప్రయత్నాలు చేయడం, దీక్షచేసేవారికి సంఘీభావంగా పక్కన కూర్చొన్నా క్షణం వృధా చేయని సీరియస్ రీడర్‌గా ఫోజులివ్వడం, మీటింగులకు కూర్చొన్నా స్వయంగా పెన్నూ పేపరుతో నోటింగులు చేసుకోవడం ద్వారా తాను గొప్ప చదువరిగా పదిమందిముందు ప్రదర్శనకు నిలవాలని చేసే తపన చూస్తే నాకు అతని పట్ల జాలితో పాటు, నాకు ఒక గొప్ప పాజిటివ్ నోట్ కనిపిస్తుంది, అదేమంటే-

రాజకీయ యవనికనుండి సినిమా పోస్టర్లదాకా ప్రతిచోటా మనోడు తనలోని లోపాల్ని కవర్‌చేసుకుంటూ ఇలా పుస్తకాలతో కనిపిస్తూ, తనకు రాకపోయినా చదువు యొక్క గొప్ప విలువని తెలుసుకుని దానితో తనకు గొప్ప అనుబంధమున్నట్లు ప్రకటించడం ద్వారా సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ విషయంలో నాకు ఇతను బాగా నచ్చాడు. ఇతని ఆరాటాన్ని ఇతని అభిమానగణం అర్థంచేసుకుని బాగా చదవాలని; కులం, కుటుంబం బలంలేని అనుచరులంతా బాగుపడాలంటే కనీసం చదువుకోవాలని కోరుకుంటూ… ఇటువంటి చదువురాని వకీల్‌సాబ్‌ని ముందుపెట్టుకుని ఏన్యాయాన్నీ సాధించలేమనే వాస్తవాన్ని అర్థం చేసుకుని విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ.. అల్‌ది బెస్ట్!

గుర్తుంచుకోండి, అన్ని ముక్తులకీ, విముక్తులకీ మూలం చదువు. దాన్ని చదవాల్సిన సమయంలో ఎక్కువ చదవండి. చనిపోయేంత వరకు కొంతతక్కువైనా చదువుతూ వుండండి. మీరు స్వయంగా చదవనినాడు ప్రతివాడూ చెప్పేవాడే అవుతాడు, నీ బ్రతుకంతా వినడమే వుంటుంది.

Siddarthi subhashchandrabose