మోడీ గారు ఇది టీ కొట్టు కాదు….

ఎలక్ట్రిక్ వెహికిల్స్ విషయంలో ప్రధాని మోడీకి షాకిచ్చారు.. ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్. ఎలక్ట్రిక్ వెహికల్స్‌ కు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీ వంటివి మంచివేనని రాజీవ్ బజాజ్ తెలిపారు.

వీటి వల్ల కంపెనీలకు, వాహన కొనుగోలుదారులకు ఈవీలపై ఆసక్తి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల అమలు దశల వారీగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

Read Alsg : లైంగిక దాడిలో ఓ ఏనుగు చనిపోయింది

ఇది కూడా చదవండి : టిఆర్ఎస్ పార్టీ జెండా కూడా కనిపించని దుస్థితి…

ఓ జాతీయ టీవీ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ఏమన్నారంటే.. .‘మేం 2.5 కోట్ల టూవీలర్లను, త్రీవీలర్లను తయారు చేస్తున్నాం. వీటిని రాత్రికిరాత్రే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం కుదరదు’ ‘వాహన పరిశ్రమ అనేది టీ స్టాల్ కాదు. రాత్రికిరాత్రే ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి’.. అంటూ తీవ్ర స్థాయిలో మోడీకి కౌంటర్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : వీ6 తీన్మార్ వార్తల్లో కొత్త యాంకర్.. ఎవరో తెలుసా..?

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్ లో నిర్ణయం తీసుకుంది.

అలాగే కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చార్జీల ఎత్తివేత, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ పై తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ, కొనుగోలు ధరలో డిస్కౌంట్ వంటి ఆఫర్లు ప్రకటించింది.