“అధికార వికేంద్రీకరణ వద్దు”

మెడకాయమీద తలకాయవుండి, ఆ తలకాయలో గుజ్జువున్నవాడేవడైనా సరే, ఈ నినాదం వింటే మొహం పగలగొట్టకుండా ఆగడు.

మెడకాయమీద తలకాయవుండి, ఆ తలకాయలో గుజ్జువున్నవాడేవడైనా సరే, ఈ నినాదం వింటే మొహం పగలగొట్టకుండా ఆగడు.

ఒకప్పుడు రాజులు, చక్రవర్తులుండేవారు. అధికారాలన్నీ అతడివే. అతడు మాట్లాడిందే చట్టం, అతడు లాక్కున్నదంతా సుంకం, అతనికన్ను పడిన ఆడమనిషి నివాసం అంతఃపురం, అతని గుర్రం తిరిగిన ప్రాంతం అతని ఆధీనం, అతడి నివాసం రాజధాని. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యాలు వచ్చాయి. అధికారాలు రాజునుండి ప్రజకు ఉద్యమాలు, పోరాటాలు, ప్రాణత్యాగాలూ చేసుకుని సాధించారు. అధికారాలన్నీ ఒకరిదగ్గరే వుంటే అవినీతి, నియంతృత్వం, బంధుప్రీతి, అసమర్థత, మందకొడితనం మరల విజృంభిస్తాయని అధికారాల్ని వికేంద్రీకరించి శాసన, కార్యనిర్వాహక, న్యాయ అధికారాలుగా విభజించి, డిల్లీనుండి గల్లీదాకా రాష్ట్రపతినుండి వార్డు కౌన్సిలర్ దాకా అధికారాలు విభజించి అప్పగించారు.

తాము అన్నిపనులూ చేసుకోలేమని కొంతమందిని జీతభత్యాలకు నియమించుకున్నారు. వారే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, న్యాయమూర్తులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రభుత్వ అధికారులు.

డిల్లీలోనే అధికారం కేంద్రీకృతం కారాదని రాష్ట్ర, స్థానిక పాలనలకు రాజ్యాంగాలూ, వాటికి సవరణలూ వచ్చాయి. పంచాయితీలు, నగరపాలికలు వచ్చాయి. జిల్లానుండి, తాలూకాలూ, పల్లెలు, వార్డులదాకా ప్రజల తరపున పాలన సాగడానికి అధికారాలు వికేద్రీకరించబడినాయి.

సర్వాధికారాలున్న ప్రజల పాలనా పద్దతులు ఇంత వికేంద్రీకరించబడినాక, ఇప్పుడు నాగరికతలో వెనక్కి పోయి అధికారాలన్నీ ఒకే చోట వుండాలి. అవి చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రిని రాజు అనాలి. అతడి నివాసాన్ని రాజధాని అనాలని ఎవడికైనా తలంపుకొస్తే అతడు శుద్ద తిరోగమనవాది. ప్రజాస్వామ్యానికి విద్రోహి.

Siddarthi subhashchandra bose