శభాష్ జగన్… మరో సంచలన నిర్ణయం..!

చట్టంలో చాలా సంచలన నిర్ణయాలు పొందుపరిచింది ఏపీ సర్కారు. అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్ష విధించాల్సిందేని నిర్ణయం తీసుకుంది. కేసును నిర్ధారించే ఆధారాలుంటే 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చూడనున్నారు.

మహిళలపై జరుగుతున్న వరుస దారుణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలకు భద్రత విషయంలో కీలక చట్టం చేస్తామని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన మాట నిలబెట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్ట్ ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

చట్టంలో ఏముంది..?

చట్టంలో చాలా సంచలన నిర్ణయాలు పొందుపరిచింది ఏపీ సర్కారు. అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్ష విధించాల్సిందేని నిర్ణయం తీసుకుంది. కేసును నిర్ధారించే ఆధారాలుంటే 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చూడనున్నారు. వారం రోజుల్లో విచారణ, మరో వారం రోజుల్లో కోర్టులో వాదనలు.. మొత్తంగా 21 రోజుల్లో తీర్పు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

లైంగిక దాడి కేసుల్లో విచారణకు ప్రస్తుతం 4 నెలల సమయం ఇస్తూ చట్టాలున్నాయి. దీనిని కొత్త చట్టం ద్వారా 21 రోజులకు కుదించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే.. మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు ప్రతి జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపుల వంటి  నేరాల విచారణకు ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.

సోషల్ మీడియాలో  అడ్డగోలుగా వాగితే అంతే..

సోషల్ మీడియాలో మహిళలపై అడ్డగోలు కామెంట్స్ చేసే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించింది ఏపీ కేబినెట్. మహిళలను కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగేలా పోస్టులు పెడితే చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించింది.

మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష విధించాలని ఏపీ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఈ-మెయిల్,  సోషల్‌మీడియా.. డిజిటల్ ప్లాట్ ఫాం ఏదైనా.. కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది.