home page

సీఎం కేసీఆర్ కి ఎంపీ రఘురామ 8 పేజీల లేఖ.. వారి పై చర్యలు తీసుకోండి..! 

 | 
KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ కి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.. తన అరెస్టు సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని 8 పేజీల లేఖను కేసీఆర్ కి రాశారు. తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఒక ఎంపీ అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు,  మార్గదర్శకాలను గచ్చిబౌలి పోలీస్ ఆఫీసర్ పట్టించుకోలేదని అన్నారు. ఎంపీగా ఉన్న తన అరెస్టుపై ప్రైమరీ సమాచారాన్ని కూడా పరిశీలించలేదని అన్నారు. ఏపీ సీఐడీ నుంచి ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్ తీసుకోలేదని అన్నారు. 

తెలంగాణ పోలీసులు రూల్ ఆఫ్ లా పాటించేలా చర్యలు తీసుకోవాలని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ బృందంతోపాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంను రఘురామ కోరారు.

 పలు సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్‌ చెబుతున్న మార్గదర్శకాలను. రఘురామ తన లేఖలో వివరించారు.