home page

బ్లాక్ ఫంగస్ : ఏపీలోని ఈ 17 ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స... లిస్టు ఇదే..! 

 | 
Black Fungus
 

బ్లాక్ ఫంగస్ : ఏపీలోన్ని ఈ 17 ఆసుపత్రిల్లో ఉచిత చికిత్స... లిస్టు ఇదే..! 


కరోనా నుంచి కోలుకున్నమని సంతోషించేలోపు ఇప్పుడు బ్లాక్‌ఫంగస్‌ ఎటాక్ అయి కొందరిని కలవరపెడుతోంది. ముఖ్యంగా ఏపీలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం దీనిని ఆరోగ్య శ్రీలోకి చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆస్పత్రుల జాబితాను గురువారం విడుదల చేసింది. 


ఆసుపత్రులు లిస్టు ఇదే..! 

1. జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)

2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి

3. స్విమ్స్‌, తిరుపతి

4. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)

5. జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)

6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప

7. జీజీహెచ్‌, విజయవాడ

8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు

9.జీజీహెచ్‌, కర్నూలు

10. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు

11. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)

12. జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)

13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం

14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం

15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)

16. కేజీహెచ్‌, విశాఖపట్నం

17. విమ్స్‌, విశాఖపట్నం