జబర్దస్త్ కు అనసూయ, హైపర్ ఆది గుడ్ బై..!! అభి ఏమన్నాడంటే..

తెలుగు ఎంటర్ టైన్ మెంట్ మీడియాలో టాప్ షో గా నిలిచిన జబర్దస్త్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా టాప్ ప్లేస్ కు వచ్చింది. జబర్దస్త్ లో జరుగుతున్న మార్పుల గురించి వస్తున్న వార్తలతో.. సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆల్రెడీ షో నుంచి నాగబాబు సెలవు తీసుకున్నారు. అయితే.. ఆయనతో ఎవరెవరు బయటకు జంప్ అవుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

పంచ్ లతో గిలిగింతలు పెట్టే హైపర్ ఆది జబర్దస్త్ లో కీలకమైన వ్యక్తే అని చెప్పాలి. నాగబాబుకు చాలా సన్నిహితమైన వ్యక్తి. నాగబాబుకే కాదు.. ఆయన ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరి వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాగే.. అనసూయ వీరిద్దరికి మంచి క్లోజ్. కాబట్టి.. నాగబాబుతో పాటే.. హైపర్ ఆది, అనసూయ కూడా జబర్దస్త్ కు టాటా చెప్పేసి పోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే.. హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్నారన్న వార్తలపై అతని సన్నిహితుడు.. గురువు లాంటి వ్యక్తి అధిరే అభి స్పందించారు. యాంకర్ అనసూయ, హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ లోనే కొనసాగుతారని చెప్పారు. తమకు జబర్దస్త్ తిండి పెట్టిందని అలాంటి.. ప్రోగ్రాంను ఎలా విడిచిపోతామంటూ కామెంట్ చేశారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. మరో ఆసక్తికరమైన కామెంట్ చేశాడు అభి. ఒకరిద్దరు నుంచి వెళ్లిపోయినంత మాత్రానా షో ఆగిపోదంటూ.. ఓ యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఇప్పుడు ఆది, అనసూయ ఉంటారా..? వెళ్లిపోతున్నారా..? అనేది మరోసారి క్వశ్చన్ మార్క్ గా మారింది.