బిగ్ బాస్ నుంచి అలీ రజా ఔట్ : గుక్కపట్టి ఏడ్చిన శివజ్యోతి, శ్రీముఖి

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఒక ఉద్విగ్న వాతావరణం కనిపించింది. ఊహించని విధంగా అలీ రజా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఫస్ట్ టైం నామినేట్ అయినా గానీ.. ప్రేక్షకుల ఓట్లు తక్కువగా రావడంతో హౌస్ నుంచి రజా వెళ్లిపోవాల్సి వచ్చింది.

హౌస్ లోకి నాని రావడంతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త సందడిగా నడిచిపోయింది. కానీ కాసేపటికే హౌస్ మొత్తం ఏడుపులతో దద్దరిల్లింది. ఎలిమినేషన్ లో ఉన్న శ్రీముఖీ, అలీ రజా, రవి, మహేష్ విట్టాను యాక్టివిటీ రూంలోకి పంపించారు నాగార్జున. అక్కడ ఎవరిమీద లైట్ పడితే వాళ్లు సేఫ్ అని చెప్పారు. మొదట శ్రీముఖిపై పడింది. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్లపై లైట్ పడుతుంది అని చెప్పారు నాగార్జున. ఈ సారి స్పాట్ లైట్ అలీపై పడింది.

అయితే.. రజా ఎలిమేట్ అవుతున్నారంటే శ్రీముఖి నమ్మలేకపోయింది. ఒకరకమైన క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఉండిపోయింది. ఎలిమేటెడ్ అని చెప్పగానే.. శివజ్యోతి ఎప్పటిలాగే ఏడుపు అందుకుంది. ఇక.. ఒకరి తర్వాత ఒకరు అలీ దగ్గరకెళ్లి ఏడ్చేశారు. హత్తుకుని వీడ్కోలు చెప్పారు.

హౌస్ లోంచి నాగార్జున దగ్గరకు వచ్చిన అలీ.. ఫోన్ లో ఇంటి సభ్యులతో మాట్లాడారు. అయితే బాబా భాస్కర్ మాట్లాడేటప్పుడు మాత్రం అలీ తన దుఖాన్ని ఆపుకులేకపోయాడు. కన్నీరు పెట్టుకుంటూ.. బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాడు.

మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని లైక్ చేయండి : https://www.facebook.com/batukamma/

 

Leave a Reply

Your email address will not be published.