అక్షయ్.. పృథ్విరాజ్ గా వచ్చేశాడు

ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇవాళ 2వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు తాను. నటిస్తున్న ప్రత్విరాజ్ మూవీ టీజర్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.

పుట్టిన రోజు సందర్భంగా తన జీవితంలో నటిస్తున్న ముఖ్యమైన సినిమా టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నాడు అక్షయ్. ప్రత్విరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తన జీవితంలో చాలా ప్రత్యేకమైనదన్నారు.
అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.