ఐశ్వర్యరాయ్ కి తప్పని అత్తింటి ఆరళ్లు..!

ఐశ్వర్యరాయ్ కూడా అత్తారింటి ఆరళ్లు తప్పలేదు. అత్తారింటిలోకి వెళ్లేందుకు ఐశ్వర్యరాయ్ రోడ్డెక్కింది. ఓ రోజంతా రోడ్డుపై భైటాయించింది. ఐశ్వర్యరాయ్ మాత్రమే కాదు. ఆమె తల్లిదండ్రులు కూడా రోడ్డుపై కూర్చుని నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చింది.

aishwaryarai_problems_at_inlaws_home

batukamma.com

ఐశ్వర్యరాయ్ కూడా అత్తారింటి ఆరళ్లు తప్పలేదు. అత్తారింటిలోకి వెళ్లేందుకు ఐశ్వర్యరాయ్ రోడ్డెక్కింది. ఓ రోజంతా రోడ్డుపై భైటాయించింది. ఐశ్వర్యరాయ్ మాత్రమే కాదు. ఆమె తల్లిదండ్రులు కూడా రోడ్డుపై కూర్చుని నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా డీజీపీ కూడా ఈ ఇష్యూలో జోక్యం చేసుకున్నా.. అత్తింటివారు దిగి రాలేదు. చివరకు చర్చోపచర్చల తర్వాత ఐశ్వర్యరాయ్ కి అత్తారింటిలోకి ప్రవేశం దొరికింది.

అయితే.. ఈ ఐశ్వర్యరాయ్.. సినీ నటి ఐశ్వర్యరాయ్ కాదు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యరాయ్. అత్తారింటి ముందు నిన్నటి నుంచి ఆమె చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. నిన్నంతా తల్లిదండ్రులతో కలిసి లాలూ ఇంటిముందు బైటాయించింది ఐశ్వర్యరాయ్.

aishwaryarai_problems_at_inlaws_home_2

తనను అత్తా మామలు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆడపడచు మీసా భారతి తనను వేధిస్తున్నారని చెప్పారు. కనీసం ఇంటిలో తిండి కూడా పెట్టడం లేదని ఆరోపించారు ఐశ్వర్య. తన తల్లిగారింటి నుంచి వస్తున్న ఆహారంతోనే తాను గడుపుతున్నానని చెప్పింది. ఇప్పటికే ఓ సారి ఇంటిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసింది ఐశ్వర్య.

నిన్న మరోసారి అత్తగారింటికి వచ్చింది. అయినా ఇంట్లోకి అనుమతి రాలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంట్లోకి అనుమతించేది లేదని తెగేసి చెప్పింది రబ్రీ దేవి. దీంతో మాజీ మంత్రి అయిన తండ్రి చంద్రికా రాయ్, తల్లి పూర్ణిమా రాయ్ తో కలిసి నిరసనకు దిగింది. వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలోనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. రబ్రీదేవితో మాట్లాడి ఎట్టకేలకు ఐశ్వర్యను ఇంటిలోకి పంపించారు.

aishwaryarai_problems_at_inlaws_homes_1

2018 మే నెలలో లాలూ, రబ్రీదేవిల పెద్ద కుమార్ తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యరాయ్ కి పెళ్లి జరిగింది. లాలూ జాతీయ స్థాయి నేత కాబట్టి వివాహాం చాలా గ్రాండ్ చేశారు. కానీ తేజ్ ప్రతాప్, ఐశ్వర్యరాయ్ వివాహ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. కొద్ది రోజులకే గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం విడాకుల కోసం పిటిషన్ కోర్టును ఆశ్రయించాడు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ అత్తారింటికి వెళ్లేందుకు భారీ పోరాటమే చేయాల్సి వచ్చింది.