అవును.. నిజమే బూతు డైలాగులు తప్ప ఏముంది..?

VIJAY DEVARAKONDA

నిన్న కాస్త సమయం దొరికితే, మహర్షి ప్రి రిలీజ్ ఫంక్షన్ యూట్యూబ్ లో చూసాను. ఆ దిక్కుమాలిన ప్రోగ్రాం చూస్తున్నంత సేపూ, ఒక సినీ ప్రేమికుడిగా ఒళ్ళు మండిపోయింది. అందరూ ఆ విజయదేవరకొండ ని పొగడటం తప్పితే… సినిమాలో కీలక భూమిక పోషించిన అల్లరినరేష్ గారి గురించి కనీసం రెండు నిమిషాలైనా మాట్లాడారా…?

బంగారం .. దాని వెనక దాగి ఉన్న అసలు నిజం..!

“మహర్షి” ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వెనకాల నిలబడిన అల్లరి నరేష్

అల్లరినరేష్ గారిని నేను 2010 novotel లో సంతోషం మ్యాగజైన్ అవార్డ్స్ లో కలిశాను. ఆటోగ్రాఫ్ కావాలి అని అడిగితే, ఆయన నవ్వుతూ నాదేందుకమ్మా…? లోపల చరణ్, రానా వున్నారు వాళ్ళది ఇప్పించినా అని అడిగిన క్షణం, నేను షాక్ కి గురయ్యాను. తరువాత నవ్వుతూ సంతకం పెట్టి bye చెప్పి, అతి సాధారణ మారుతి ఎస్టీలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఆ తరువాత రెండు మూడు సందర్భాల్లో ఆయన్ని కలిసినా అదే విధమైన ప్రవర్తన.

ఫెడరల్ ఫ్రంట్ ఏమాయె సారూ..?

ఆయన పేరుకి కామెడీ హీరోగా గుర్తింపు పొందినా, అతను కమేర్షియల్ కంపులో మాత్రమే కొట్టుమిట్టాడుకుండా ఎన్నో ప్రయోగాత్మక మరియు విభిన్నమైన చిత్రాల్లో నటించి ఒక మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందారు. వాటికి ఉదాహరణలే: #నేను, #ప్రాణం, #విశాఖ_ఎక్స్ప్రెస్, #లడ్డుబాబు, మొదలగునవి.

ఈ విజయ్ దేవరకొండ బాబు ఏ సినిమాలో చూసినా… నోట్లో ఏదో వున్నట్టు ఒకే విధమైన డైలాగ్ డెలివరీ, సినిమాలో నాలుగు బూతులు మాట్లాడటం, నాలుగు మూతులు నాకడమే పరమావధిగా చేసుకొని, పబ్లిక్ ఫంక్షన్స్ లో సైతం మీ పెద్దవారు చెప్పే మంచి వినకండి, ఇది చేయండి, కూర్చోండి, వంగండి, లాంటివేమి వినొద్దు. F__k off everything, Its ur life, neeku nacchindi nuvvu cheyi. Whether it is gud or bad అని యువతకు అజ్ఞానబోధనలు చేస్తూ… This is Attitude & I’m Attitude ka baap అని పిచ్చి వాగుడు వాగుతున్నందుకు, ఈయనకు ఆ ఫంక్షన్లో ప్రాముఖ్యత ఇచ్చారా…? లేక డబ్బే సర్వస్వం, హిట్టు సినిమాలే ఎదిగే మెట్లుగా భావించి ఇతగాడిని నెత్తిన పెట్టుకున్నారో అర్ధం కాలేదు.

అల్లరినరేష్ లాంటి వారికి విజయ్ దేవరకొండ, నటనలో కానీ, వ్యక్తిత్వం లో కానీ… నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం వుంది.

అయినా మహేష్_బాబు లాంటి వారే… ఈ విజయ్ లాంటి వారిని పక్కన పెట్టుకోవటం, తనకి హిట్టు సినిమాలు ఇచ్చిన దర్శకుల పేర్లను మాత్రమే స్టేజీపై చెప్పటం చూస్తుంటే, కళామ్మతల్లి కి కళ కన్నా కాసులు ఎక్కువైపోయాయని అర్ధమవుతుందిలే…!

సంగ్రహణ : ఫేస్ బుక్

మరిన్ని అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.