ఆకట్టుకుంటున్న 6టీవీ బతుకమ్మ పాట

“శిట శిట కురిసేటి శినుకోలే నవ్విందమ్మా గౌరమ్మా.. సింగిడిలో రంగులనే తనలో చూపిస్తుందమ్మా గౌరమ్మా…”

తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. గ్రామాల్లో కంటే ముందుగానే టీవీల్లో, యూట్యూబ్ లో పండుగ సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన ఛానల్స్ అన్నీ బతుకమ్మ పాటల ప్రోమోలు రిలీజ్ చేశాయి.

6టీవీ ఓ అడుగు ముందుకేసి ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది. “శిట శిట కురిసేటి శినుకోలే నవ్విందమ్మా గౌరమ్మా.. సింగిడిలో రంగులనే తనలో చూపిస్తుందమ్మా గౌరమ్మా…” అంటూ సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ పాటను చరణ్ అర్జున్ రచించగా.. వాణికిశోర్ వొల్లాల పాడారు. చందు తూటి దర్శకత్వం వహించారు.