ఫిదా పాటకు జనం ఫిదా

‘వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కెట్ ఏసిండే.. గమ్మున కూర్చొనీయడే.. కుదురుగా నిల్చోనీయడే’ అంటూ ఫిదా చిత్రంలో వచ్చిన పాట.. సినిమా రిలీజ్ అయ్యాక ఓ ఊపు ఊపేసింది. ఇది ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తున్నా ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

అవును.. నిజమే బూతు డైలాగులు తప్ప ఏముంది..?

వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే పాట.. మనసుకుక హత్తుకునే లాగ ఉంటుంది. దీనికి సాయిపల్లవి డ్యాన్స్ తోడవ్వడంతో చాలామంది ఈ పాటను పదే పదే చూస్తున్నారు. ఇపుడు ఈ పాట అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ పాటను ఇప్పటి వరకు రెండు వందల మిలియన్లు అంటే 20 కోట్లు మందికి పైగా వీక్షించారు. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శక్తికాంత్ కార్తీక్ కంపోజ్ చేయగా.. మధుప్రియ పాడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

బంగారం .. దాని వెనక దాగి ఉన్న అసలు నిజం..!

ఫెడరల్ ఫ్రంట్ ఏమాయె సారూ..?

మరిన్ని అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.