చాలు శ్రీముఖి… చూడలేకపోతున్నాం

టీవీ యాంకర్ శ్రీముఖికి అభిమానులు ఎందరో. పటాస్ ప్రోగ్రామ్ ఆమెకు తీసుకొచ్చిన క్రేజే వేరు. స్టేజీ షోలు.. టీవీ షోల్లో శ్రీముఖి ఉంటే ఆ సందడే వేరు. చలాకీ మాటలు… నవ్వులు… పంచ్ డైలాగులు… సరదా సెటైర్లు… వీటికి కొదువే ఉండదు. కానీ.. శ్రీముఖి అభిమానులు కూడా ఇపుడు అబ్బే.. ప్చ్ … అనేస్తున్నారు.

శ్రీముఖి బాగా లావైపోయింది. లావు కావొద్దని కాదు… కావొచ్చు. అది వారి ఇష్టం. కానీ… ఓ టీవీ షోతో వీక్షకులను అలరించే ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు అదే యాంగిల్ లో చూడాల్సిందే. ఎప్పుడో ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో… సన్నజాజితీగలా ఉండే శ్రీముఖి… ఇపుడు భారీగా ఒళ్లు చేసింది. దాంతో.. ఆమెకు వేసిన కాస్ట్యూమ్స్ కూడా ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. తన ముఖంలో కళ శ్రీముఖికి పెద్ద అసెట్. ఐనంతమాత్రాన కెమెరాలు ఎప్పుడూ ఫేస్ నే చూపించవు కదా. అందుకే… కెరీర్ బాగున్నప్పుడే ఫిజిక్ పై కూడా కాస్త దృష్టిపెడితే బాగుంటుంది అన్నది అభిమానుల సూచన. ఈ మధ్య ఫొటోషూట్లతో హాట్ లుక్ ఇస్తున్నా.. దానికి ఫిజిక్ తోడైతేనే మరింత అందం అనేది ఫ్యాన్స్ భావన.

ఝాన్సీని చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే బాగా స్లిమ్ గా మారి.. కొత్తగా కనిపిస్తున్నారు. సీనియర్ గా ఆమె అంత డెడికేషన్ చూపించినప్పుడు.. యంగ్ ఏజ్ లో ఉన్న శ్రీముఖి… తన కెరీర్ పై మరింకెంత జాగ్రత్త  చూపించాలి. అసలే కాంపిటీషన్ టైమ్. ఫేడవుట్ కాకముందే.. ఒంటిపై శ్రద్ధపెట్టడం మంచిది.