KCR సెక్రటేరియట్ ఎందుకు కూల్చేస్తున్నాడో తెలిసిపోయిందోచ్..!

వాస్తుపై కేసీఆర్ కు ఉన్నది నమ్మకం కాదు.. పిచ్చి

సెక్రటేరియట్ కూల్చివేతపై రేవంత్ రెడ్డి కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని సచివాలయాన్ని కూల్చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. దాని స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని డిసైడయ్యారు. త్వరలోనే కూల్చివేతలు మొదలై.. రూ.వందకోట్ల బడ్జెట్ తో కొత్త సచివాలయం నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఐతే.. ఏ ముఖ్యమంత్రి చేయని పనిని కేసీఆర్ ఎందుకు చేస్తున్నారనే డౌట్ చాలామందిలో ఉంది. కేసీఆర్ కు వాస్తుపై నమ్మకం ఎక్కువ అనీ…. సెక్రటేరియట్ కు వాస్తు దోషం ఉందని.. ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదని ఆయనకు ఎవరో జ్యోతిష్యులు చెప్పినట్టు తెలిసింది. ఐతే.. కేసీఆర్ ఈ నిర్ణయానికి రావడానికి మరో గట్టి కారణం ఉందట. అదేంటో మల్కాజిగిరి ఎంపీ , కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పారు. 

తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అనేది అందరికీ తెలిసిన విషయమే. ఐతే…  రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ సీఎం కొడుకు ముఖ్యమంత్రి కాలేదట. ఇందుకు హైదరాబాద్ లోని సెక్రటేరియట్ వాస్తు ప్రధాన కారణం అని ఎవరో జ్యోతిష్యులు కేసీఆర్ కు చెప్పారట. ఈ వాస్తు దోషం కారణంగా… సీఎం కొడుకులు సీఎంలు కారు.. కాలేరు.. కానీ.. వారి అల్లుళ్లు సీఎంలు అవుతారని చెప్పారట. గతంలో ఎన్టీఆర్ సీఎం అయితే.. ఆయన కొడుకులు మళ్లీ సీఎంలు కాలేకపోయారు. కానీ.. ఆయన అల్లుడు చంద్రబాబు సీఎం అయ్యారు. ఇపుడు సీఎం కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో హరీష్ రావుకు, కేటీఆర్ కు మళ్లీ అంతటి పాపులారిటీ ఉంది. హరీష్ రావు కేసీఆర్ కు మేనల్లుడు. ఈ వాస్తు దోషం ఇక్కడ కూడా బెడిసికొట్టి తన కొడుకు కేటీఆర్ కు సీఎం పదవిని ఎక్కడ దూరం చేస్తుందో అన్న భయంతోనే సెక్రటేరియట్ ను వీలైనంత త్వరగా కూల్చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు గా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది తప్పని.. ప్రజాధనం వేస్ట్ చేయొద్దని.. సీఎస్ ను కలుద్దామని సెక్రటేరియట్ కు వెళ్లారు. ఆయన లేకపోవడంతో పర్సనల్ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చారు. “వాస్తును నమ్మడం మంచిదే.. కానీ.. వాస్తుపై కేసీఆర్ కు ఉన్నది నమ్మకం కాదు. పిచ్చి” అని పంచ్ డైలాగ్ పేల్చారు రేవంత్ రెడ్డి.