ఐటీఐతో DRDOలో ఉద్యోగం : జీతం 28 వేల పైనే..

drdo_jobs

డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్(డీఆర్‌డీవో)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఆర్డీవో ఎంట్రీ టెస్ట్ అయిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్(సెప్టమ్)-9కు సంబంధించిన ఈ నోటిఫికేషన్‌లో టెక్నీషియన్ ఏ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, కోపా, డ్రాఫ్ట్స్‌మెన్(మెకానికల్), డీటీపీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషనిస్ట్, మెకానిక్(డీజిల్), మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మోటార్ మెకానిక్, పెయింటర్, ఫొటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్ విభాగాల్లో మొత్తం 351 ఖాళీలున్నాయి. గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలని అధికారులు వెల్లడించారు.

మొత్తం ఖాళీల సంఖ్య : 351

ఆటోమొబైల్-3

బుక్ బైండర్ 11

కార్పెరంటర్ 4

కోపా 55

డ్రాఫ్ట్స్‌ మెన్(మెకానికల్) 20

డీటీపీ ఆపరేటర్ 2

ఎలక్ట్రీషియన్ 49

ఎలక్ట్రానిక్స్ 37

ఫిట్టర్ 59

మెషనిస్ట్ 44

మెకానిక్(డీజిల్) 7

మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 4

మోటార్ మెకానిక్ 2

పెయింటర్ 2

ఫొటోగ్రాఫర్ 7

షీట్ మెటల్ వర్కర్ 7

టర్నర్ 24

వెల్డర్ 14

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత

వయసు : 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి

అప్లికేషన్ ఫీజు : రూ.100/-

ఎంపిక : టైర్ 1(సీబీటీ), టైర్ 2(ట్రేడ్ టెస్ట్)

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) 150 మార్కుల (ఆబ్జెక్టివ్)కు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ సైన్స్ అంశాల నుంచి 50 మార్కుల, మిగిలిన 100 మార్కులు సంబంధిత ట్రేడ్ సబ్జెక్టుకు కేటాయించారు. 120 నిమిషాల్లో పూర్తి చేయాలి.

రాతపరీక్షలో కనీస అర్హత మార్కుల సాధించనవారే టైర్ 2 (ట్రేడ్/స్కిల్) టెస్ట్ నిర్వహించి ఫైనల్‌గా ఎంపిక చేస్తారు.

పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైతో పాటు దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో

రిజిస్ట్రేషన్ ప్రారంభం : జూన్ 3 నుంచి

చివరితేదీ : జూన్ 26

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.. వెబ్‌సైట్ : www.drdo.gov.in